Wednesday, May 13, 2015

ve veelaa varnaalaa

మిత్రులకి వందనం

దర్శకుడు గీతా కృష్ణ  గురించి తెలిసే ఉంటుంది, చాల తక్కువ చిత్రాలే చేసినా మంచి చిత్రాలు చేసారు, ఆయన మొదటి చిత్రం సంకీర్తన, ఈ చిత్రం లోని పాటలన్నీ బాగుంటాయి. ఆయన చేసిన మిగతా చిత్రాలలో కీచురాళ్ళు, కోకిల, టైం లాంటి మంచి చిత్రాలు ఉన్నాయ్ అన్ని చిత్రాలలో పాటలు బాగుంటాయి, గీతాకృష్ణ సంగీత అభిమాని కావడం చేత మనకి మంచి పాటలు కల చిత్రాలు ఇచ్చారు. మొదటి చిత్రం తోనే ఉత్తమ నూతన చిత్ర దర్శకునిగా నంది పురస్కారం అందుకున్నారు.

సంకీర్తన చిత్రానికి కూడా రాజా గారే సంగీతం, నారాయణ రెడ్డి గారు, శాస్త్రి గారు, ఆత్రేయ గారు పాటలు రాసారు. అన్ని పాటలు నాకు నచ్చినా ఎందుకో శాస్త్రి గారి మనసున మొలిచిన సరిగమలే మరియు వే వేలా వర్ణాలా పాటలంటే ఎక్కువ అభిమానం.

నాగార్జున కూడా ఈ కోవకు చెందినా చిత్రాలు చెయ్యగలరు అని నిరూపించారు. సత్యం మాస్టారి దగ్గర నేర్చుకున్న కూచిపూడి నృత్యం రమ్యకృష్ణ కి ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిందనే చెప్పాలి, బాగా చేసింది తనుకూడా.

ఆర్ధికంగా లాభ పడక పోయినా మన మనసులలో నిలిచే పాటలు రాజా గారు మనకి అందించారు.

శాస్త్రి గారికి ప్రకృతి మీద ఎంత ప్రేమో ఈ లైన్ చూడండి "వాన వేలి తోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట"


వే వేలా వర్ణాలా ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు
పలికే నాలో గీతాలై
వే వేలా వర్ణాలా ఈ నేలా కావ్యాలా

ఓ గంగమ్మ పోద్దేక్కిపోతోంది తొరగా రాయే
ఓ తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి
పల్లే పల్లే పచ్చని పెళ్ళి పందిరి
పల్లే పచ్చని పందిరి
నిండు నూరేళ్ళు పండు ముద్దైదువల్లే ఉండు
పంట లచ్చామి సందడి
పంట లచ్చామి సందడి

వాన వేలి తోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట
కాళి దాసు లాటి ఈ తోట  రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలటా
ప్రతి కదలికలో నాట్యము కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా
ఎదకే కనులుంటే

వే వేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు
పలికే నాలో గీతాలై
వే వేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
లా లా లా లా లా లా

https://www.youtube.com/watch?v=1W5FvQ1H-Cc

మనసున మొలిచిన సరిగమలే
 గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుచేరి
 కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎద సడితో నటియించగ రా
స్వాగతం సుస్వాగతం(2)

కుకు చుకు చుకు కుకు చుకు చుకు
కుకు చుకు చుకు కుకు
రారా స్వరముల సోపానములకు
పాదాలను జత చేసి
కుకుకు కుకుక్కూ కీర్తన తొలి అమనివై రా
పిలిచే చిలిపి కోయిలా ఎట దాగున్నావో(కుకు)

మీ నృత్యం చూసి నిజంగా..నిజంగా

మువ్వల రవళి పిలిచింది
కవిత బదులు పలికింది
కల నిదుర చెదిరింది
మనసు కళను వెతికింది
వయ్యారాల గౌతమి
వయ్యారాల గౌతమి  కన్యారూప కల్పన
వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాల బాట నీకై వేచెనే(కుకు)
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకూ కుకుక్కు
సుధలూరే యాలాపన కుకుకు కుకుక్కు

లలిత లలిత పదబంధం మదిని
మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం
అవని అధర దరహాసం
మరందాల గానమే
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వలె  మ్రోల

https://www.youtube.com/watch?v=zk432gZAgNA









No comments:

Post a Comment