Tuesday, May 5, 2015

jaaji malli totalonaa lyrics

మిత్రులకి వందనం

ఏమిటో ఈ పేజి ప్రారంభం నుంచి ఇళయరాజా గారి పాటలే ఎక్కవ వస్తున్నాయి, తప్పేమీ లేదు, మరి అయిన అన్ని మంచి పాటలు చేసారు, మనం ధన్యులం.
కులశేఖర్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు చేసారు, అన్ని అల్ మోస్ట్ హిట్ పాటలే, అందులో నాకు బాగా నచ్చిన పాట "నిను చూడక నేనుండ లేను" చిత్రం లోని సాధనా సర్గమ్ పాడిన జాజి మల్లీ పాట. సాధనా గారి గురించి ఒక విషయం చెప్పాలి, రాజా గారు, ఎ ఆర్ ఎక్కువగా ఆమె చేత పాడిస్తారు ఏమో తెలియదు, పాడిన అన్ని పాటలు హిట్, రుద్రమ దేవి (రాబోయే) చిత్రం లో అవునా నిజమేనా పాట కూడా పాడించారు రాజా.
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా
ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో
జాజి మల్లీ తోటలోనా
జాజి మల్లీతోటలోనా ఊసులాడే గోరు మైనా
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా
ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో
జాజి మల్లీ తోటలోనా
రోజు చూస్తువున్నా స్నేహంగానే ఉన్న చెప్పలేనే ఎందుకో మరి
నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా అందుకోడే ఇంత ప్రేమని
ఏ నీలి మేఘానితో రాయాలి నా ప్రేమని
ఏ పూల రాగాలతో పంపాలి ఆ లేఖని
మనసేమో క్షణమైన ఒక చోట ఉండదే
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా
జాజి మల్లి తోటలోనా
అమ్మా బాబు అన్నా నువ్వే దారి అన్నా చిన్న మాట గొంతు దాటదే
మాటే రాదంటున్నా దారే లేదంటున్నా గుండె చాటు ప్రేమ ఆగదే
ఏ ఊహల్లుయ్యాలలో నా ఆశ తీరేదెలా
ఈ గాలి కౌగిల్లలొ నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి మదిలోన బాధని
జాజి మల్లీతోటలోనా ఊసులాడే గోరు మైనా
జాజి మల్లీ తోటలోనా ఊసులాడే గోరు మైనా
ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లహిరి లో
జాజి మల్లీ తోటలోనా


No comments:

Post a Comment