Saturday, May 2, 2015

dhim dinaktari naktik tom

మిత్రులకి నృసింహ జయంతి శుభాకాంక్షలు

దర్శకుడు దశరధ్ తన మొదటి చిత్రం చాలా చక్కగా మలిచారు, మనషులకు మమతలే విలివలుగా మలిచారు చిత్రాన్ని.

కింగ్ పక్క గ్రేస్ ఉన్న సింగు, అందమైన శ్రియ చక్కగా ఉన్నారు,

ఆర్ పి సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలో సోదరుడు కులశేఖర్ నాలుగు పాటలు రాసారు, శాస్త్రి గారి  "నే తొలిసారిగా" పాట ఒక ఫేవరేట్ గీతం అయితే, బాగా నచ్చిన పాట సోదరుడి  శంకర్ మహాదేవ పాడిన దీం దినక్ నక్తక్  తొమ్.

మన దేశంలో పెళ్ళి ఒక అద్భుతమైన ఘట్టం గా భావిస్తాం, ఎన్నో కలలు కంటాం, పెళ్ళి అంటే సంబర పడిపోతాం మనదైనా వేరేవారిదైనా ఆ ఆనందమే వేరు.

సోదరుడు కొన్ని ప్రయోగాలు భలే చేసాడు, అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో , సందట్ల సందయ్యో పెళ్ళవని  జంటలకి ఆనందం అందించే ఈ క్షణం  లాంటివి, నిజమే నేను చూసా ఒక పెళ్ళికి వెళితే ఎవరో ఒకరికి సంబంధం కుదురుతుందిట, లేక పొతే కొత్త ప్రేమ పావురాలు పుడతాయిట 


దిన్ దినక్ తరి నక్తిక్ తోం  
దిన్ దినక్ తరి నక్తిక్  తోం 
దిన్ దినక్ తరి నక్తిక్  నక్తిక్  తోం 
గుప్పెడంత గుండెల్లో  చెప్పలేని ఆనందం 
ఈ క్షణాలే ఎంతో సంతోషం 
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం 
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం 

అమ్మాయిల చేతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ  లేదయ్యో ఈ దినం 
సందట్ల సందయ్యో పెళ్ళవని  జంటలకి ఆనందం అందించే ఈ క్షణం 
పేకాట రాయళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్లి లోగిళ్ళలో 
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు  కుర్రాళ్ళు విడిదింటిలో 
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట 

ఈ పెళ్ళి పందిర్లో సరదాల సందడిలో ఈ నేల కొచ్చిందయ్యో  అంబరం 
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగ ఈ ఇంట జరగలయ్యో సంబరం 
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో 
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో 
కన్యదాతకి  అప్పగింతలు కంటితుడుపులు తప్పవంటా 

https://www.youtube.com/watch?v=DZ2yKtwLCUo


No comments:

Post a Comment