Monday, May 11, 2015

andaalalo aho mahodayam

మిత్రులకి వందనం

మొన్న 9దవ తారీకుకి సరిగ్గా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం, 1990 May 9న రిలీజ్ అయ్యింది ఆ చిత్రం, తొమ్మిదవ తరగతి నుండి పదవతరగతికి వస్తున్నా అప్పుడు. 9th class పరిక్షలు పూర్తి కాగానే next టెన్త్ క్లాసు అని సెలవలలో కూడా చదివించడం మొదలు పెట్టారు మా నాన్నగారు మా బావా, అదే టైములో ఈ చిత్రం రిలీజ్ అందులోను చిరంజీవి సినిమా, ఏదో కష్టపడి సినిమా చూసాం. చిరంజీవి స్టార్డం పెంచిన చిత్రం. ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట "అబ్బ ని తియ్యని దెబ్బా " కాని చాలామందికి గుర్తుకురాని అదే వేటూరి గారి ఇంకొక పాట అందాలలో అహో మహోదయం. సాహిత్య పరంగా ఎంతో అద్భుతంగా రాసినా అంతగా జనాల నోటిలో ఈ పాట పలకలేదు. ఇళయరాజా సంగీతం, KR picturization చాల బాగుంటుంది.

ఈ పాట పాడింది బాలు గారు, జానకి అమ్మ అని అన్ని చోట్ల రాస్తున్నారు కాని నాకు డౌట్ ఇది చిత్ర పాడారేమో అని, ఎందుకంటే మొదటి చరణం లో చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే అనే లైన్ లో కొండలకే అన్న చోట తొందలకే అన్నట్టుగా వినపడుతుంది, చిత్ర గారు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలు తెలుగు సరిగా రాదుకదా అందుకేమో, 

చూడండి వేటూరి గారేనా రెండు పాటలు రాసింది అనిపిస్తుంది,  గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే అంటారు. 



అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడె సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

https://www.youtube.com/watch?v=g3MFxLZM87A

No comments:

Post a Comment