Thursday, May 14, 2015

kuhu kuhu bole koyaliyaa

మిత్రులకి శుభోదయం

నేటి తరానికి తెలియని మొన్నటి తరానికి చెందిన మహానుభావుడు శ్రీ పి ఆదినారాయణరావు గారు, మీకు ఇంకా తేలిక గా తెలియాలంటే ఈయన మీకందరికీ తెలిసిన తెలుగువారి  అపర సీతమ్మ అంజలి దేవి గారి భర్త. నిర్మాతగా, రచయత గా, సంగీత దర్శకునిగా అన్ని  రంగాలలో నిష్ణాతుడు. నేను 1998లో కర్ణాటకలో పనిచేసే రోజులలో ఒక క్యాంటీన్ ఓనర్ (ఉడిపి వాస్తవ్యులు) ఏదో మాట్లాడుతూ సినిమాల గురించి,  నన్ను అడిగారు నీకు ఆదినారాయణరావు గారి గురించి తెలుసా అని. actual gaa అయితే నేను అంతకు ముందు ఎప్పుడు అయిన గురించి వినలేదు, తెలియదు అని చెప్పా, అప్పుడు అయిన గొప్పతనం గురించి అయిన చేసిన చిత్రాల గురించి, తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో అయిన చేసిన చిత్రాల గురించి చెప్పాక నాకు సిగ్గు వేసింది, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి మన వారి గురించి తెలుసు మనకి తెలియకపోయిందే అని అనిపించింది, హాయీ హాయీ గా ఆమనీ పాడే, పిలువకురా అలుగకురా లాంటి evergreen  హిట్స్ ఆయిన చేసినవని తెలుసుకున్నా. మిత్రులకి పరిచయం చెయ్యాలనిపించింది. zee టీవీ సారీగామపా లాంటి ప్రోగ్రంలలో ఎన్నో సార్లు కుహు కుహు బోలే కోయలియా పాట విన్నప్పుడల్లా  ఎంతో ఆనంద పడిపోయేవాడిని, మన తెలుగు వాడు చేసిన పాటని హిందీ వాళ్ళు కూడా పడుతున్నారు అని గర్వపడేవాడిని, నిజంగా మనమందరం గరించదగ్గ మహనీయుడు శ్రీ ఆదినారాయణరావు గారు.  మీకోసం ఈ రోజు ఆయన నిర్మించి సంగీతాన్ని అందించిన మన అక్కినేని, అంజలి నటించిన సువర్ణ సుందరి హిందీ వెర్షన్ కుహు కుహు బోలే కోయలియాపాటనే పెడుతున్నా ఈ రోజు

https://www.youtube.com/watch?v=vhS8wEgwuRM

No comments:

Post a Comment