మిత్రులకి శుభోదయం
షష్టి పూర్తి చేసుకున్న గురివుగారికి శుభాభినందనలు,
నేను చెప్పినట్టు ఈరోజు కూడా శాస్త్రి గారి పాట మీ కోసం
జాగర్లమూడి క్రిష్ చిత్రం "కృష్ణం వందే జగద్గురుమ్" నాకు నచ్చిన చిత్రాలలో ఒకటి, దగ్గుపాటి రామానాయుడు ఈతరం నటులలో వెత్యాసమ్ చూపించే నటుడు, మొదటి చిత్రమే అల్లాంటిది చేసాడు తను. ఆ చిత్రం కోసం శాస్త్రి గారు రాసిన దశావతార అవతరణ మనందిరికి కనువిప్పు.
ముందుగా ఈ దశావతారం పాటలో ఆఖరున చెప్తారు గురువుగారు అది
నరుడి లోపలి పరుని పై దృష్తి పరుపగా.....
తలవంచి కైమోడ్చి శిష్యుడవి నీవైతే....
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడువి నీవే... అని
గురువు గారివి పాటలు కాదు మాలాంటి వారికి పాఠాలు.
ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రంలో గురువు గారు ఇలా అన్నారు, బహుశా ఈ రచన చెయ్యాడానికి గత 28 సంవత్సరాలుగా ఈ రంగం లో ఉన్నానా అని అనిపించింది నాకు... దీని తరువాత ఇంకేదైనా నేను రచన చెయ్యొచ్చునా.... చెయ్యవలసిన అవసరం ఉందా అనిపించేంత పరాకాష్ట కి తీసుకెళ్ళి పోయినటువంటి రచన....అని, అయ్యా ఎంత మాట ఇంకా ఇంకా ఇంకా ఎన్నిన్నెన్నో పాఠాలు మాకు చెప్పాలి మీరు
శాస్త్రి గారు ఈ పాట రాయడానికి 6 మాసాలు తీసుకున్నారట, ఎంత సమయం తీసుకున్నారని కాదు ఎంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చారన్నది ముఖ్యం. కూర్మావతారం గురించి రాసిన ఆ లైన్ నన్ను బాగా ఆకట్టు కుంది "చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే...
పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే....
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక....
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది...
క్షీర సాగర మధన మర్మం....." చూడండి ఇక్కడ కూడా సహనం, ఓర్పు అంటూ ప్రేరణని కలిగించే వాక్యాలని రాసారు,
కృష్ణావతారం లో "ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా.. నిన్ను నీకే నూత్న పరిచితునిగా
అయ్యా షష్టి పూర్తే కాదు, సప్తతి, అశీతి, సహస్ర చంద్ర దర్శనాలు కూడా మీరు జరుపుకోవాలి, మీకు ఆ జగన్నాధుడు ఆయురారోగ్యలని ఇవ్వాలని మస్పూర్తిగా కోరుతున్నా.
zee tv కుటుంబం అవార్డ్స్ function లో అభిరామ్ అనే బుల్లి తెర నటుడు ఈ గీతాన్ని అద్భుతంగా అభినయించాడు, దర్శకుడు క్రిష్ ఎంతో అనుభూతికి గురియ్యాడు, please watch video also .
మణిశర్మ పాటలు రాలేందటి అనుకునేరు చూడండి ఇంత కన్నా మంచి పాట మణి కన్నా వేరే ఎవరైనా చెయ్యగలరా, అది రాసిన దానికి ట్యూన్ కట్టడం.
అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా
నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా...

దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము.... " నిన్ను నీకే పరిచయం చేసుకోమనడం, అది కూడా కొత్తగా అబ్బా ఎంత గొప్ప ఆలోచన, భగవద్గీత సారాంశం మొత్తం ఒక్క మాటలో చెప్పరే,
అయ్యా షష్టి పూర్తే కాదు, సప్తతి, అశీతి, సహస్ర చంద్ర దర్శనాలు కూడా మీరు జరుపుకోవాలి, మీకు ఆ జగన్నాధుడు ఆయురారోగ్యలని ఇవ్వాలని మస్పూర్తిగా కోరుతున్నా.
zee tv కుటుంబం అవార్డ్స్ function లో అభిరామ్ అనే బుల్లి తెర నటుడు ఈ గీతాన్ని అద్భుతంగా అభినయించాడు, దర్శకుడు క్రిష్ ఎంతో అనుభూతికి గురియ్యాడు, please watch video also .
మణిశర్మ పాటలు రాలేందటి అనుకునేరు చూడండి ఇంత కన్నా మంచి పాట మణి కన్నా వేరే ఎవరైనా చెయ్యగలరా, అది రాసిన దానికి ట్యూన్ కట్టడం.
జరుగుతున్నది జగన్నాటకం...
జరుగుతున్నది జగన్నాటకం...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం.
నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం.

చెలియలి కట్టను తెంచుకుని విలయం విజృంభించునని..
ధర్మమూలమేమరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని...
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయుతనిచ్చి...
నావగ త్రోవను చోపిన మత్శ్యం కాలగతిని సవరించిన సాక్ష్యం...

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే...
పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే....
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక....
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది...
క్షీర సాగర మధన మర్మం....

ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగనురికే ఉన్మాదమ్మును...
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉధ్ధరించగల...
ధీరోధ్ధతి రణ హుంకారం... ఆదివరాహపు ఆకారం....

ఏడీ ఎక్కడరా.. నీ హరి దాక్కున్నాడేరా భయపడి ...
బయటకి రమ్మనరా ఎదుటపడి... నన్ను గెలవగలడ తలపడి....
నువు నిలిఛిన ఈ నేలను అడుగు... నీ నాడుల జీవజలమ్మును అడుగు...
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు... నీ ఊపిరిలో గాలిని అడుగు...
నీ అణువుల ఆకాశన్నడుగు.. నీలో నరునీ హరినీ కలుపు..
నీవే నరహరివని నువు తెలుపు....

ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...

ప్రతి పదానికి అర్ధం చెప్పే ప్రయత్నం చేయడం కోసమే బ్రాకెట్ లో పెట్టా, తప్పులుంటే పెద్దలు దిద్దగలరు, చెప్పగలరు.
అమేయమనూహ్యమనంత విశ్వం..
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం.. ఈ మానుష రూపం...
కుబ్జాక్రుతిగా.. బుధ్ధిని భ్రమింపజేసే... అల్ప ప్రమాణం...
ముజ్జగాలను మూడడుగులతొ కొలిచే త్రైవిక్రమ విస్తరణం...
జరుగుతున్నది జగన్నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం....

పాపపు తరువై.. పుడమికి బరువై... పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ..
పరశురాముడై.. భయదభీముడై.. ధర్మాగ్రహ విగ్రహుడై నిలఛిన...
శోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు...

ఏ మహిమలూ లేక.. ఏమాయలూ లేక.. నమ్మశక్యం కాని ఏ మర్మమూ లేక....
మనిషిగానే పుట్టిఉ మనిషిగానే బ్రతికి...మహిత చరితగ మహిని మిగలగలిగే మని కి...
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే...

ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా.. నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము....
దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము....
అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా
నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా...
నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి కైమోడ్చి శిష్యుదవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే.....
వందే కృష్ణం జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం....
కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం....
కృష్ణం వందే జగద్గురుం..

https://www.youtube.com/watch?v=tJKmtv0WIsY
No comments:
Post a Comment