మిత్రులకి శుభోదయం
తెలుగు చలనచిత్ర మొదటితరం కవులలో నాకు బాగా నచ్చిన గొప్ప రచయత శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, అద్భుతమైన సాహిత్య విలువలు ఉన్న గీతాలు రచించారు.
ఈ తరం సంగీత ప్రియులకి తలియని మంచి సంగీత దర్శకులు మాస్టర్ వేణు, ఆయన హీరో భానుచందర్ తండ్రి గారు అని కూడా కొందరికి తెలియదు అనుకుంటా, ఆయన సంగీత దర్శకత్వంలో మంచి పాటలు ఉన్నాయ్, నాకు బాగా నచ్చిన పాట "రాజమకుటం (1959)" చిత్రం లోని "సడి సేయకో గాలి" పాట, శ్రీమతి లీల ఎంత హృద్యంగా పాడారో ఈ పాట.
కృష్ణ శాస్త్రి గారు మాత్రమే రాయగలరు అంత గొప్పగా రాసారు, పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే, విరుల వీవన బూని విసిరి పోరాదే, చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే అబ్బా ఎంత బాగా రాసారు, రెండవ చరణంలో చూడండి నాయక చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు, అయ్యా మేము అదృష్టవంతులం మీరు తెలుగు వారిగా పుట్టడం.
సడి సేయకో గాలి సడిసేయబోకే
సడి సేయకో గాలి సడిసేయబోకే
బడలి వొడిలో రాజు పవ్వళించేనే
సడి సేయకే
రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే
సడి సేయకే
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదిరి చూసేనే
నిదుర చేదిరిందంటే నీనూరుకొనే
సడి సేయకే
పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
ఈడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన బూని విసిరి పోరాదే
సడి సేయకే
https://www.youtube.com/watch?v=x4HaUBtOubo

No comments:
Post a Comment