మిత్రులకి శుభోదయం
సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయిగా సినిమా సీమకి వచ్చిన కోటేశ్వరరావు మనకి బాగా పరిచయం కోటి గా, ఈ రోజు అయిన పుట్టిన రోజు, రాజు తో కలిసి చాలా చిత్రాలు చేసిన తరువాత విడిగా చెయ్యడం మనకి తెలిసిందే, ఆయిన చాలా మంచి పాటలు చేసారు, నాకు బాగా నచ్చిన అయిన పాట గోకులం లో సీత చిత్రం లోని గోకుల కృష్ణ గోపాల కృష్ణ పాట. అంతకుముందు కూడా చెప్పా శాస్త్రి గారికి కృష్ణ పరమాత్ముడు అంటే చాలా ప్రేమ ప్రీతి అని, అయిన కాకుండా ఎవరు రాయగలరు.
నిందలు కృష్ణ పరమాత్ముడికి తప్పలేదు కదా, చూడండి శాస్త్రి గారి వివరణ భలే రాసారు, చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా అని అంటే, ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా అంటారు. అందుకే మనిషిలోని మంచి చెడ్డలు రెండు చూడాలి అంటారు, అప్పుడే ప్రతి వ్యక్తీ మంచిగా కనిపిస్తాడు.
ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే
వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
పదుగురి నిందలతో పలుచన కాకయ్యా
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఏ నోట విన్నా నీ వార్తలేనా
కొంటె చేష్టలేలరా కోణంగిలా
ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా
కల్లబొల్లి మాటలే నా రాధికా
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా
ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా
తెలియని లీలలతో తికమక చేయకయా
మనసుని చూడకనే మాటలు విసరకలా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా
అంతతోనే ఆగెనా ఆ బాలుడు
అవతార మూర్తిగా తన మహిమ చాటెగా
లోకాల పాలుడు గోపాలుడు
తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కథ తరములు నిలిచె కదా
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
https://www.youtube.com/watch?v=wD6O-8vwI5A&list=RDwD6O-8vwI5A
No comments:
Post a Comment