Wednesday, May 6, 2015

maanasa veena mouna swaranaa

మిత్రులకి వందనం

ఎవరో నన్ను అడిగారు ఎందుకు నీకు సీతారామ శాస్త్రి అంటే అంట పిచ్చి అని, ఎం చెప్పను వాళ్ళకి, ఆయన ఆద్రం, ఆయన భావం, ఆయన ఆలోచన విదానం, దేని గురించి చెపితే తెలుస్తుంది వాళ్ళకి.

లిప్ సింకింగ్ కోసమని చెత్త మాటలని రాసే కవులలాంటి వాడు కాదు అని చేప్పలన్పించిది కాని వాళ్ళకి చెప్పడం కన్నా మిత్రులకి ఈ పాట పరిచయం చేద్దాం అని అనిపించింది.

మే మాదం అని తమిళ చిత్రాన్ని హృదయాంజలి అని తెలుగు డబ్బింగ్ చేసారు, వినీత్ సోనాలి నాయకా నాయికలు, కే బాలు డైరెక్టర్, ఏ ఆర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్ర గారి పాట వినండి,  చూడండి కూడా.

శాస్త్రి గారు ఇందులో ప్రతి పదం ప్రకృతిలో కలిసిపోయి రాసరనిపించింది,

పున్నమి నదిలో విహరించడం, తారల పొదరింట రాతిరి మజిలి, ఊహకు ఊపిరి పోసే చిరుగాలి అయ్యా వాళ్ళకి ఇవేమీ అర్ధం కావు కాని మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు రాయండి ఇంకా రాయండి, చిరస్మరనీయంగా ఉంటారు, 

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే
మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి
మానసవీణ మౌన స్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం
వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం

ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి 
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే
మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం
తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే
నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం

https://www.youtube.com/watch?v=33VasJ-EbHM

No comments:

Post a Comment