Tuesday, May 12, 2015



ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ అయ్యాక కూర్చొని యాదాలాపంగా ఫెసుబుక్ చూస్తూఉంటే ఒక స్నేహితురాలి పోస్ట్ కనిపించి చదివా, చదివాక నామీద నాకే చిన్నతనం అనిపించింది, ఒక ఏడు సంవత్సరాల వయసు ఉండే, మూడవ తరగతి చదివే పిల్ల ఆలోచనంతైనా  మనం ఆలోచించలేక పోతున్నామే అనిపించింది. చుట్టూ పరికించి చూసా వాకింగ్ చేస్తున్నవారిలో కొందరు అదే లాన్ మీద ఉమ్మే వారు, మూలకి పోయి ఒకటి కూడా కానిచ్చే వారు, వారితో పాటు తెచ్చుకున్న కాగితాలని, పొలథిన్ కవర్లని పడేసేవారు చాలా మంది కనిపించారు, గట్టిగా వాళ్ళమీద అరిచి వారందరికీ ఈ పోస్ట్ చూపించాలన్నత కోపం వచ్చింది. ఆ చిన్నపిల్లకి ఇల్లాంటి ఆలోచనా విధాన్నాన్ని పెంపొందించటానికి కృషి చేసిన తల్లి తండ్రులకి ముందుగా నా అభినందనలు, తప్పకుండా అమేయ (ఆ చిన్ని పిల్ల పేరు) పాఠశల ఉపాద్యాయులు విద్యతో పాటు సామాజిక స్పృహ గురించి కూడా చెప్తున్నరనే అనుకుంటా. తల్లి నీ eye for detail కి జోహార్. మనం కళ్ళు మూసుకొని, చెవులు, ముక్కూ కూడా తిరుగుతున్నాం, సమాజంలో ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారికి చేరుతుందా లేదా అన్నది  పక్కన పెడితే ఈ పోస్ట్ చదివిన నాలాంటి వారికి కనువిప్పే, sanitation గురించి ఆ వయసు పిల్ల ఆలోచన ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనతో సమానం అనడం అతిశయోక్తి కాదంటా. ఎందుకంటే ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన స్వచ్ భారత్ ఆదిలోనే హంస పాదు అన్నట్టు, మూడురోజుల ముచ్చట తీరిపోయి మూలన పడింది. ఒక విషయం మిత్రులు గమనించాలి ఇది ఒక పార్టీని విమర్శించడానికొ లేక వేరే ఏదైనా ప్రయోజననికో మాత్రం కాదు, ఎందుకంటే ఆ వయసు పిల్లలకి ఇంకా మన రాజకీయ నాయకులు ఓటు హక్కు ఇవ్వలేదు కదా. ఇది మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అనుకునే ఎవరైనా ఇలానే ఆలోచించాలి అందుకు ఈ చిన్ని అమేయ (పేరే చూడండి ఎంత గొప్పగా ఉందొ) నుండి మనం నేర్చుకుందాం. వీలయితే మీరు కూడా షేర్ చెయ్యండి, ముఖ్యంగా మీ ఇంటిలో సబ్యులతో పాలుపంచుకోండి.

No comments:

Post a Comment