Friday, May 1, 2015

arjuna naamalu

మిత్రులకి సుమనఃసుమాంజలి

జనవరి మాసంలో శైలజమ్మ గారు ఆర్జునిని దశ నామాలని మనకి తెలియజేసారు, వాటిని కొంచెం వివరంగా, విఫులంగా చూద్దాం.

చిన్నప్పుడు మా నాయనమ్మ గారు ఉరుములు, మెరుపులు వర్షంతో వస్తే అర్జున, ఫాల్గుణ, పార్ధ, కిరీటి అని ఆ దశ నామాలు అనమనేవారు. ఎందుకనాలి అని అడిగేవాడిని, అందుకు తను ఇలా అనేది. ఒకక్క నామానికి అర్ధం చెపుతూ, ఆలా అర్జునిని తలచుకుంటే బయపడకుండా ఉంటామని, ఆయన సుగుణాలన్ని మనల్ని కాపాడతాయని.
"అర్జునః ఫాల్గునో జిష్ణుః కిరీటీ శ్వేతవాహనః,
బీభత్సుర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః"

అనేది ఆ దశ నామాల శ్లోకం 

1. ధనంజయుడు : అన్నిదేశాలను జయించి రాజ్యాన్ని వారికే అప్పగించి ధనాన్ని మాత్రము తీసుకొన్నవాడు కనుక..
2. విజయుడు : యుద్ధానికి వెళితే దురాత్ములను జయించకుండా వెనుతిరిగిరాడు అందువలన...
3. శ్వేతవాహనుడు :ఆతని రథాశ్వాలు తెల్లగా ఉంటాయి అందుచేత...
4. ఫాల్గునుడు :ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో జన్మించినందువలన...
5. కిరీటి :పూర్వం దేవతలకోసమని దానవులతో యుద్ధం చేసి విజయం చేసినపుడు స్వయంగా ఇంద్రుడే ఆతని శిరస్సుపై కిరీటం పెట్టినందువల్లన ...
6. బీభత్సు :యుద్ధరంగంలో.., చూసేవారికి ఎన్నడూ జుగుప్సను కలిగించేట్టు గా ప్రవర్తిమ్పకపోవడం వల్లన...
7. సవ్యసాచి : గాండీవాన్ని రెండుచేతులతో నారిసారించి బాణాలు వదలగలిగే నేర్పు ఉండడం చేత...
8. అర్జునుడు : ఆతని శరీరవర్ణాన్ని పోలిన రంగు భూలోకంలో ఎవరికీ ఉండదట.. అందుచేత పరిశుద్ధ కర్మానువర్తనుడయినందు వల్లన...
9. జిష్ణువు : ఎవ్వరినైనా తానే జయిస్తాడు తప్ప అతనిని ఎదిరించే వారు ఎవ్వరూ లేకపోవడం ...
10. కృష్ణ : ఆతని శరీరవర్ణం కృష్ణభాస్వరవర్ణం ... చిత్తాకర్షక వర్ణమవడం చేత ఆతని తండ్రి ఆ పేరు పెట్టేడట...!
అసలు పేరు పార్థుడు ...

No comments:

Post a Comment