మిత్రులకు వందనం
సత్యం మాస్టారి గురించి చాలామందికి తెలియక పోవచ్చును, డోలక్ సత్యంగా చిత్ర సీమకి వచ్చారు. మంచి సంగీతాన్ని అందించారు. భక్త కన్నప్ప, గృహప్రవేశం, నోము, బాలమిత్రుల కధ లాంటి మ్యుసికల్ హిట్స్ ఇచ్చారు. నాకు బాగా నచ్చిన సత్యంగారి పాట బాల మిత్రుల కధ లో జానకి గారు పాడిన, నారాయణరెడ్డి గారి గీతం గున్నమామిడి కొమ్మ మీద పాట.
చిన్నప్పుడు రేడియో లో వచ్చినప్పుడు తెగ వినేవాడిని,
బిన్నత్వం లో ఏకత్వం ప్రస్పుటంగా చెప్తారు రెడ్డి గారు, రంగు రూపు జాతి రీతి ఏది వేరైనా మనసులు కలిస్తే మిత్రులౌతారు అంటారు. మంచి సాహిత్యం.
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామ చిలకుంది ఒక గూటిలోనా కోయిలుంది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది "2"
పొద్దున్న చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే, పొద్దున్న చిలకను చూడందే ముదు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయలా
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి "2"
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి
https://www.youtube.com/watch?v=puk4zKduAMk
No comments:
Post a Comment