Monday, May 11, 2015

kaliki chilakala koliki

మిత్రులకి శుభోదయం

మరకతమణి కీరవాణి మన తెలుగు సంగీత దర్శకులలో ఒకరు కావడం మన భాగ్యం, సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో ప్రారంభమైన అయిన ప్రయాణం, ఎన్నో అణిముత్యాల లాంటి చిత్రాలతో అలరారుతోంది. ఆపద్భాందవుడు, అన్నమయ్య, పాండురంగమహత్యం, రామదాసు, మాతృదేవోభవ  లాంటి ఎన్నో మంచి చిత్రాలకి సంగీతాన్ని అందించారు.

సీతారామయ్య గారి మనవరాలు చిత్రం లో ని చిత్ర గారు పాడిన, వేటూరి గారి కలికి చిలకల కొలికి మాకు మేనత్త గీతం విన్న ప్రతి సారి నా చేత కంటతడి పెట్టించింది,  ముఖ్యంగా రెండవ చరణం, పుట్ట గానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది లైన్,  అలాగే మొదటి చరణం లో నేటి అత్తమ్మా నాటి కోడలివే తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి అన్నప్పుడు సుతి మెత్తగా చివాట్లు పెట్టినట్టు, మామని రామయ్యగా, అత్తని  సీతమ్మగా రామాయణాన్ని ఉపయోగించుకోవడం వేటూరి వారికే చెల్లింది.


కలికిచిలకల కొలికి మాకు మేనత్తా  కలవారి కోడలు కనకమాలక్ష్మి ||2||
అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు  ఎరుగని  పసిపంకజాక్ష్మ
మేనాలు తేలేని మేనకోడల్ని  అడగవచ్చా మిమ్ము ఆడకూతిర్ని  
వాల్మికినేమించు వరస తాతయ్య  మా ఇంట్టకంపించవయ్య మావయ్య ఆ..ఆ.. || కలికి||

ఆ చేయి ఈ చేయి అద్దగొడలికి   ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి  తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని  నాలికై తల్లి గా చూసే పూలల్లో  దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు ఉ..ఉ.. || కలికి||

మసక బడితే నీకు మల్లె పూదండా తెలవారితే నీకు తేనెనీరెండా
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్ట గానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామా సయ్యోద్యనేలేటి సాకేత రామా || కలికి||

https://www.youtube.com/watch?v=1NB9LVv2CuA


No comments:

Post a Comment