Friday, May 15, 2015

chuttu chengaavi cheeraa


మిత్రులకి శుభోదయం

ఈ పేజీ ప్రారంభించి నెల పైగా కావస్తున్నా ఇప్పటిదాకా ఆరుద్ర గారి పాట ప్రస్తావన తేనందుకు చింతిస్తున్నా, నిన్నటి తరం గొప్ప రచయత శ్రీ ఆరుద్ర గారు. మిత్రులు కొందరికి ఆరుద్ర గారి సాహిత్యం గురించి తెలియక పోవచ్చు, ఒక మనవి తెలుగు భాష మీద అభిమానం ఉంటే మీరు తప్పకుండా ఆరుద్ర గారి పుస్తకాలు చదవండి, ఆయన రాసారని మీకు తెలియక పోయినా కొన్ని అద్బుతమైన పాటలు ఉన్నాయి మచ్చుకకి, మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం (మంచి కుటుంబం), తెలుగు నాట ప్రతి పెళ్ళి వీడియోలో వినిపించే "శ్రీ రస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది "పెళ్ళి పుస్తకం " పాటా, చుట్టూ చెంగావి చీరా కట్టావే చిలకమ్మా (తూర్పు వెళ్ళే రైలు) లాంటివి ఎన్నో ఉన్నాయ్.

భారతీయ నారి  చీరలోనే అందంగా ఉంటుంది అన్నది అక్షరాలా సత్యం, రంగు రంగుల చీరలని వర్ణిస్తూ ఆయన కలం ఇంద్రధనుస్సు చూపించింది మనకి, కేవలం గాయకుడిగానే కాదు మంచి  సంగీత దర్శకుడు కూడా అని బాలు గారు అనిపించుకున్న చిత్రం తూర్పు వెళ్ళే రైలు, బాపు-రమణలు చేసిన ఈ చిత్రం, బాలు గారు పాడిన ఈ పాట ఈ రోజు మీకోసం,

youtube లో నేటి తరం heroines ఫొటోస్ తో చేసిన వీడియో మీకోసం.

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా(2)
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ(చుట్టూ)

తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మ
నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ
ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా
పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా(చుట్టూ)

నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోలాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు(చుట్టూ)

https://www.youtube.com/watch?v=p0OxTC6W5pU

No comments:

Post a Comment