Thursday, May 21, 2015

chandana charchita

మిత్రులకి సుమనఃసుమాంజలి

తెనాలి రామకృష్ణ చిత్రం అంటే మనందిరికి చాలా చాలా ఇష్టం, తెనాలి రామకృష్ణ ఎలా ఉంటారో మనకి తెలియదు, కృష్ణ దేవరాయలు ఎలా ఉంటారో కూడా తెలియదు కాని ANR అండ్ NTR చూసాక అలాగే ఉంటారని మనం నిర్ణయించుకున్నాం. అంత గొప్పగా నటించారు వారు.

M S విశ్వనాథన్ - రామ్మూర్తి జంట మొదటి తరం సంగీత దర్శకులు వాళ్ళే ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది.

చాలా మంచి పాటలు ఇందులో, సుశీల గారి చేత జయదేవుని అష్టపది పాడించారు. నాకు చాలా ఇష్టమైన పాట, మోహన రాగంలో చెయ్యబడింది.

మిత్రులకి ఒక మనవి మీ పిల్లలకి గీత గోవిందం గురించి జయదేవుని అష్టపదుల గురించి చెప్పండి. ఈరోజు దొరకని information లేదు నెట్ లో. వాటి అర్ధాలతో కూడా కొంతమంది పెడుతున్నారు, ప్లీజ్ చూడండి.

సినిమా లో లేని చరణాల్ని కూడా చేర్చా.


అనేక నారీ పరిరంభ సంభ్రమ
స్ఫురన్ మనోహరి విలాస లాలసం
మురారి మారదుప దర్శయంత్యసౌ
సఖీ సమక్షం పునరహ రాధికా ||

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ
కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ||

పీనపయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం
గోపవధూ రనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగం ||హరిరిహ ||

కాపి విలాస విలోల విలోచన ఖేల జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూ రధికం మధుసూదన వదన సరోజం ||హరిరిహ ||

కాపి కపోలతలే మిళితాలపితుం కమపి శ్రుతి మూలే
కాపి చుచుంబ నితంబవతీ దైతం పులకైరనుకూలే ||హరిరిహ ||

కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునా జల కూలే
మంజుల వంజుల కుంజగతం విచకర్ష కరేణ దుకూలే ||హరిరిహ||

కరతల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే
రాస రసే సహ న్రుత్య పరా హరిణా యువతిహి ప్రశశంసే||హరి రిహ||

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా
పశ్యతి సస్మిత చారుతరా మపరా మనుగచ్చతి వామా ||హరిరిహ||


శ్రి జయదేవ భణిత మిద మద్భుత కేశవ కేళి రహస్యం
బ్రుందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యం ||హరిరిహ ||


https://www.youtube.com/watch?v=Y2dsHubjpPE

No comments:

Post a Comment