Thursday, May 21, 2015

ennenno janmala bandham

మిత్రులకి వందనం

మునుపు కూడా చెప్పా నాకు రాజన్-నాగేంద్ర అంటే నాకు చాలా ఇష్టం అని,  వారు చేసిన మ్యూజికల్ హిట్స్ లో పూజ చిత్రం ఒకటి, అందులో అన్ని పాటలు చాలా బాగుంటాయి. నాకు బాగా నచ్చిన పాటలు మల్లె తీగ వాడి పొగ, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఈ రెండు పాటలు దాశరధి గారు రచించినవే. ఇప్పటిదాకా దాశరధి గారి పాటలు మిత్రులకి గుర్తుచేయ్యలేదు, అందకు క్షమించమనే అడగాలి.

దాశరధి గారు తెలుగు లోనే కాకుండా english, urdu భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్న కవి. కమూనిస్ట్ పార్టీ లో పని  చేసి second world war సమయంలో ఆ పార్టీ లోంచి బయటకి వచ్చేసారు. నిరంకుశ నిజాం పరిపాలని ఎదిరించిన వారిలో ముందున్నారు, ఆ రోజులల్లో ఎన్నో ప్రభావితం చేసే కవితలు రాసారు తెలంగాణా ప్రజల విముక్తి కోసం మచ్చుకకి "

రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్ అన్నాడు 

సినిమా పాటల విషయంలో దాశరధి గారు భలే హుషారైన పాటలు కూడా రాసారు, ఇద్దరు మిత్రులులో కుషి కుషీగా నవ్వుతూ, మూగ మనసులలో గోదారి గట్టుంది గట్టుమీదా మిట్టుంది, ఆత్మీయులు లో మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె, లాంటి ఎన్నో మంచి పాటలు రాసారు. 

ఈరోజు మీకోసం పూజ చిత్రంలో బాలు, వాణి జయరాం కలిసి పాడిన అల్ టైం నా ఫేవరేట్ సాంగ్. 

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది 
ఎన్నటికి మాయని మమతా నాది నీది 
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను 
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను 

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి నిన్నే చూసిన వేళా నిండును చెలిమి 
నువ్వు కడలివయితే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను  చేరనా 

విరిసిన కుసుమము నీవై మురిపించేవు తావిని నేనై నిన్ను పెనవేసేను 
మేఘము నీవై నెమలిని నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా ఆడనా 

కోటి జన్మలకైనా కోరేదొకటి నాలో సగమై ఎపుడు నేనుండాలి
నీవున్న వేళా ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ ఉండనీ ఉండనీ 

https://www.youtube.com/watch?v=Tag-l4uTjxg




No comments:

Post a Comment