Saturday, May 16, 2015

sivaranjani navaraagini


మిత్రులకి శుభోదయం

శివరంజని రాగం అంటే కేవలం పెతాస్ సాంగ్స్ మాత్రమే చేస్తారు అనుకుంటాము కాని తప్పు అని రమేష్ నాయుడు గారి  తూర్పు పడమరలో శివరంజని నవరాగిణి పాటతో మనకి అర్ధం అవుతుంది. నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి. నారాయణ రెడ్డి గారి కలం ఆ రాగాన్ని ఇంకొక మెట్టు ఎక్కించ్చిందనే చెప్పాలి. శివరంజని రాగం మంచి డ్యూయెట్ గా కూడా వాడచ్చని అని రాజా గారు "అబ్బని తియ్యని దెబ్బా " పాటని కూడా చేసారు, అలాగే మహదేవన్ గారు అసంబ్లీ రౌడి చిత్రంలోని "అందమైనా వెన్నెలలోనా " పాట అది కొందరికే సాద్యం.

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని

రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝారి తరంగానివీ
స్వర సుర ఝారి తరంగానివీ
సరస హృదయ వీణ వాహినీ

శివరంజని నవరాగిణి

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణి
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే..... రావే నా శివరంజని... మనోరంజని
రంజని నా రంజని

నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ


https://www.youtube.com/watch?v=ieb2Xtr_jY4

No comments:

Post a Comment