Friday, May 15, 2015

cheekati to veluge cheppenu

మిత్రులకి వందనం

నేటి తరం సినీ గేయరచయతలలో కొన్ని మంచి పాటలు రాసిన వారు చంద్రబోసు, నా ఆటోగ్రాఫ్ చిత్రం లోని గుర్తుకొస్తున్నాయి పాట కానివ్వండి, స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కానివ్వండి, నేనున్నాను లో చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నాని కానివ్వండి, శాస్త్రి గారి తరువాత అల్లాంటి పాటలు బోస్ మాత్రమే రాయగలరని నిరూపించారు.

V  N  ఆదిత్య చేసిన కొద్ది మంచి సినిమాలలో నేనున్నాను ఒకటి, కీరవాణి గారి సంగీతం, బోస్ సాహిత్యం అందించిన టైటిల్ సాంగ్ కీరవాణి గారితో సునీత పాడారు.

నిజంగా టైటిలే అద్భుతంగా పెట్టారు ఆదిత్య, ఏవండి ఎవరైనా మనం కష్టాలలో ఉన్నాం అంటే నేనున్నాను అంటే చాలు ఎంత ధైర్యం వస్తుంది, గుండెతో తో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని, అంతకన్నా ఇంకేం కావాలి.  



చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని 
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని 
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని 

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని 
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందు కెళ్ళలని 
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని 
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని 
గుండెతో తో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను 
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని 
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని 

ఎవ్వరు లేని ఒంటరి  జీవికి తోడూ దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబందాన్ని  పంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను 
మనసుతో మనసే చెప్పెను 
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని 
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని 
చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని 
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని 
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని 

https://www.youtube.com/watch?v=pmC2aVle85A

No comments:

Post a Comment