Saturday, May 9, 2015

ammaa avani nelatalli

మిత్రులకి మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు

విదేశాల నుంచి వచ్చిన సాంప్రదాయం అయిన చాలామంది జరుపుకుంటున్నాం, ప్రేమికుల నుంచి మాతా పితల వరకు అన్ని దినోత్సవాలను జరుపుకుంటున్నాం.

మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి అమ్మ పడే కష్టం వర్ణనాతీతం. మళ్ళి ఇంకో జన్మ అని అంటారు, ఒక రోజు కాదు ప్రతి రోజు స్మరించి పూజించాలి అమ్మని

అమ్మ మనల్ని ఈ అవని మీదకి తెచ్చి ఆమెకి అప్పగిస్తుందిట, ఈ తనువు చాలించే వరకు ఈ భూమాత మనల్ని తన కడుపులో పెట్టుకొని పెంచుతుంది కదా అందుకే నేను ఈ రోజు భూమాతకు కూడా మాత్రు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

అమ్మలందరికి ఈ పాట డేడికేట్ చేస్తున్నా

కీరవాణి గారి సంగీత సారద్యంలో వచ్చిన రాజన్న చిత్రంలోని కే శివ దత్తా గారు రచించిన, మాళవిక పాడిన అమ్మ అవని గీతం చూడండి. బేబీ Annie  ని అభినందించకుండా ఉండలేం.
చాలామందికి తెలియక పోవచ్చును ఈ పాట రాసిన శివ దత్తా గారు ఎవరో కాదు కీరవాణి గారి  తండ్రిగారు.

పల్లవి : 

అమ్మా... అవనీ...
అమ్మా... అవనీ... నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా 
తనివితీరదెందుకని ॥
అనుపల్లవి :
కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ


చరణం : 1 

త ల్లీ నిను తాకితేనే 
తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే 
మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ
కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వె నాకు
స్వర్గం కన్నా మిన్న ॥

చరణం : 2 

నీ బిడ్డల శౌర్య ధైర్య 
సాహస గాథలు వింటే
నరనరాలలో 
రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస... రిగగ రిపప
గదదద పదదద... సదసద పగపద
సద సద సద సద
పద సద... పద సద (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస... రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా... గరిసదపా
గప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగ పదస రిగ - పా
గప గరి సరిసద
వీరమాతవమ్మా...
రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా...
నువు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే 
ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన 
కొంచెమే కదమ్మా
అది మించిన నాదన్నది 
నీకీగలదేదమ్మా ॥

https://www.youtube.com/watch?v=wglaXiwAON0

No comments:

Post a Comment