Monday, July 27, 2015

venu maadhavaa

మిత్రులకి వందనం

పాతతరం గాయనిమణులు జనకమ్మా, సుశీలమ్మా, జిక్కి, లీలా ఇలా ఎందరో వారి మధురమైన గళంతో చిరస్థాయిగా, సుస్థిరమైన ముద్ర మనపై వేసారు, వారితరువాత అంతే మధురస్వరంతో మనకి చేరువైయ్యారు చిత్రమ్మ. తన 7 సంవత్సరాల కూతురిని దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నా కుములిపోకుండా ఎన్నో మంచి పాటలు పాడి మనకి వినోదాన్ని పంచుతున్న చిత్రగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమ్మా మీరు, మీ పాటలు చిరకాలం మమ్ముల్ని అలరిస్తాయి మీకు ఆయురారోగ్యలని ఇవ్వాలని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని కోరుతున్నా. ఆమె అద్భుతంగా పాడిన వేణుమాధవా పాట చూద్దాం  ఈ రోజు.

నేనున్నా చిత్రం కోసం కీరవాణి గారు సంగీతం అందించగా, శాస్త్రి గారి రచన.

వేణుమాధవా..ఆ..(2)

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో(2)
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాస లో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా..ఆ..(ఏ శ్వాసలో)

మునులకు తెలియని జపములు
జరిపినదా..మురళీ సఖి
వెనుకటి బ్రతుకునచేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన
గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణ నిన్ను చేరింది
అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది
వేణుమాధవా..నీ సన్నిధి(ఏ శ్వాసలో)


చల్లని నీ చిరునవ్వులు కనపడక
కనుపాపకి
నలు వైపులా నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి అలజడితో ఆణువణువూ తడబడదా..
ఆ..ఆ..
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణు మాధవా నీ సన్నిధి
గాగ్గరే గారే సరే గాగ్గా రీరే సరే
గపద సాస్స దప గారే సారీ
గగదపదా గాపదసదా
దా పా గా రీ గా
దాపద సాస్స దాపద సాస్స
దాపద రీర్రే దాపద రీర్రే దాసరే గారే సారీ
గరేసరీ డా రే గారే సరిగా రెస దప
గగగాపాప్ప గగగాదాస్సా గగగాసాస్సా
దపగాపగరే సరేసరే గారే సరేస దాసరీ
గదప సగరీ
పగపదసరీ సరేగాపగారీ సద
పదపసదాస పదపసదాస
పదప రేసరే నాదన రేసరే
పద సరి గారి సద పదస గగస రిదాస
సరిగపదసరిగా
ఆ..రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

https://www.youtube.com/watch?v=gSh6JilCQLg

No comments:

Post a Comment