Thursday, July 9, 2015

peete peeta

ప్రియ మిత్రులకి సుమనః సుమాంజలి

చాలారోజులు అయ్యింది మిమ్ములని కలసి, కన్నయ్య మీద ఉన్న  భక్తి వలన ఈ మద్య తెగ చదివేస్తున్నా శ్లోకాలు, పద్యాలు. ఎందుకో చాలా బాగుంది అనిపించింది, మీతో పంచుకోవాలని అనిపించి ఈ వ్యాసం రాయ సంకల్పించా.



శ్లో : పీఠే పీఠ నిషణ్ణ బాలకగళే తిష్ఠన్స గోపాలకః యన్త్రాన్తస్థిత దుగ్ధ భాండమవకృష్యాఛ్ఛాద్యఘణ్టారవం,
      వక్త్రో పాంత కృతాంజలిః కృతశిరః కంపన్ పిబన్నః పయః, పాయాదాగతః గోపికా నయనయోః గండూష ఫూత్కార కృత్


కన్నయ్య కి పాలు వెన్నలు దొంగలించడం అలవాటుకదా!  పక్కనే వున్న గోపిక ఇంటిలో దూరాడుట స్నేహితులతో సహా, పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ కలయచూస్తున్నాడు ఒక మూల పైన ఉట్టే కనిపించింది గదిలో ఇటు అటు చూసాడుట ఒకసారి, ఇంకొక మూల ఒక బల్ల ఉంటే అది తీసుకొని వచ్చి దాని మీద ఒక స్నేహితుడిని నిలబెట్టి వాని మెడలమీద ఈయన కూర్చున్నడుట, సరే ఉట్టే అందింది స్నేహితులవైపు ఒక సారి చూసాడు, రేపల్లెలో గోప కాంతలకి కన్నయ్య చిలిపి చేష్టలు తెలుసు కదా, అందుకని ఉట్టే ముట్టుకుంటే చాలు చప్పుడయ్యే గంట ఒకటి కట్టారట ఆ ఇంటి గోపిక, కన్నయ్య ఏమైనా తక్కువ వాడా, ఉట్టెకు కట్టిన గంటను ఒక చేతితో పట్టుకుని, ఉట్టెలొని కుండని ఇంకో చేతితో పట్టుకుని వంచి దోసిడి పట్టాడుట, చూడండి ఒక చేత్తో గంట, మరో చేతితో కుండ, దోసిట్లో పాలు, ఇక్కడ చతుర్బుజుడుగా గోచరిస్తాడు స్వామి. సరే పాలు పుక్కిట పట్టి స్నేహితుల వైపు తిరిగి  బావున్నాయిరోయి అనుకుంటూ, తలూపుతున్నాడుట, ఇంతలో గోపిక రానే వచ్చింది చప్పుడైతే, తలుపు చాటునుంచి ఇలా వచ్చిందో లేదో, కన్నయ్య పుక్కిటనున్న పాలు ఆవిడని చూడగానే ఎదురుగా ఉన్న ఆమె ముఖం మీద ఉమ్మేసి ఎంచక్కా అంతా జారుకున్నారుట.

ఇది పై శ్లోకానికి అర్ధం, ఎంత భావుకతో చూడండి, ఆ నాడు ఇంతటి భావన ప్రకర్షతో గోపికలు కన్నయ్యను పొందారు, అంతే భావనం తో లీల శుఖుడు అనే ఆయినా ఒక కావ్యమే రాసారు శ్రీకృష్ణ కర్ణామృతం అని, అందులోది ఈ శ్లోకం. మళ్ళి అంతటి భావన్నని కన్నయ్య పట్ల లక్ష్మణ యతీంద్రులలో చూస్తాం.

ఓం భగవతే వాసుదేవాయా!  

No comments:

Post a Comment