మిత్రులకి వందనం
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) పేరు వినగానే మహాప్రస్థానం మాత్రమే గుర్తొస్తుంది చాలామందికి, సినీ గేయ రచయితగా అన్ని రకాల పాటలు రాసిన మహా కవి ఆయిన. ఈ మౌనం ఈ బిడియం (Dr . చక్రవర్తి ), ఎందుకో సిగ్గెందుకో (సిరి సంపదలు ), హాయి, హాయిగా జాబిల్లి (వెలుగు నీడలు ), కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే (ఆత్మీయులు ) ఇలాంటి ఎన్నో రొమాంటిక్ పాటలు, పాడవోయి భారతీయుడా (వెలుగునీడలు), ఉంది లే మంచి కాలం ముందు ముందునా (రాముడు భీముడు ) లాంటి దేశభక్తి గీతాలు కూడా రాసారు. తెలుగు పాటకు మొదటి జాతీయ పురస్కారం ( తెలుగు వీర లేవరా , (అల్లూరి సీతా రామరాజు ) తెచ్చి పెట్టిన కవి.
పాడవోయి భారతీయుడా పాటలో 1961 లోనే ఎంతో ముందు చూపుతో శ్రీ శ్రీ పాట రాసారు, అక్షరాల ఈ రోజు అదే జరుగుతోంది. చిన్నప్పుడు మా సైన్స్ మాస్టారు ఎప్పుడూ ఈ పాట పెట్టే వారు స్కూల్ లో, ఐ యామ్ మిస్సింగ్ యు సర్. ప్రతి ఆగష్టు 15 కి, జనవరి 26కి ఇలా ఎప్పుడు ఏ ప్రోగ్రాం అయిన తప్పకుండా వినే వాళ్ళం.
రాజసులోచన, ది గ్రేట్ ANR వావ్ వాట్ ఎ కోరియోగ్రఫీ, గోపాలక్రిష్ణన్ గారు అనుకుంటా.
అన్నపూర్ణ వారు నిర్మించిన ఈ చిత్రం, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం, పెండ్యాల గారు సంగీతం ఇస్తే, ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ పాడారు ఈ శ్రీ శ్రీ గారి గీతాన్ని.
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ..
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ..
పాడవోయి భారతీయుడా
ఓ ఓ ఓ ఓ
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసీ
సంబర పడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసీ
సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి బంధుప్రీతి
చీకటి బజారూ
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే
స్వార్ధమీ అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం
https://www.youtube.com/watch?v=avBaFtPkuhw

No comments:
Post a Comment