మిత్రులకి శుభోదయం
మరో సంగీత సరస్వతి మనల్ని విడిచి వెళ్ళారు,
ప్రొద్దున్నే కళ్ళు బయర్లుకమ్మే వార్త విన్నా, MSV ఇక లేరు అనే మాట నా చెవులు వినలేకపోతున్నాయి.
ఎన్నోచిత్రాలకి మంచి సంగీతాన్ని అందించిన మహానుభావులు అయిన. తెనాలి రామకృష్ణ, ఆకలి రాజ్యం, లేత మనసులు, మరోచరిత్ర, అంతులేని కధ, ఒకటా రెండా 1200 పై చిలికు చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహనీయులు MSV.
తొలి నాళ్ళలో రామబ్రహ్మం గారితో కలిసి విశ్వనాథన్-రామబ్రహ్మం duo గా అన్నో చిత్రాలు చేసారు.
బాలచందర్ గారు దర్శకత్వం వహించిన అంతులేని కధ లో జేసుదాసు గారిచేత పాడించిన ఆత్రేయ గారి గీతాన్ని ఈ రోజు గుర్తుచేసుకుందాం. రజిని విలక్షణమైన నటన మరిచిపోలేము, సత్యజిత్ రే గారి ప్రపంచ సుందరిని ఎలా మరిచిపోగలం, అద్భుతమైన నటనని ప్రదర్శించిన ఆ అందమైన బొమ్మ మన కళ్ళల్లో కదులుతూనే ఉంది సిరి సిరి మువ్వలు మ్రోగిస్తూ.
దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి "2"
ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
నన్నడిగి తలిదండ్రి కన్నారా .... ఆ ఆ ఆ
నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చెమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్త వాదాలె ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
శిలలేని గుడికేల నైవేద్యం ఈకలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియక పోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును ఓ అమ్మా
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం వట్టి అహంకారం ఓ చెల్లెలా ఎలా ఈ స్వార్ధం ఏది పరమార్ధం
https://www.youtube.com/watch?v=RllsvcZxqzo

No comments:
Post a Comment