Thursday, July 2, 2015

raagam rasamai

మిత్రులకి వందనం

ఇళయరాజా గారి గురించి ప్రతి సారి ఒక కొత్త విషయం చెప్పుకోవచ్చు, చాలా రోజులనుంచి అనుకుంటున్నా మీకు రాజా గారి ఒక ప్రయోగం గురించి పరిచయం చెయ్యాలని. స్వరములు 7 కదా, రాజా గారు కేవలం మూడు స్వరాలని " స రి గ " ల తో పాట చేసారు, సినిమా కి వాడలేదు అనుకుంటా, రెండు మూడు లైవ్ షోస్ లో రాజా గారు, శ్రేయ గోసాల్ పాడారు, మిత్రులు ఎవరికైనా మరిన్ని వివరాలు తెలిస్తే ఈ పాట గురించి చెప్పగలరు.

తప్పులుంటే పెద్దలు చెప్పగలరు.

ఇది కళ్యాణి రాగం అనుకుంటా!


రాగం రసమయ వేదమై స్వర సంచారములను చేయదా
తానం తకధిమి తాళమై తనువంతా పులకలు రేపదా
ప్రతిస్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్న వారి జన్మ ధన్యమై పోదా

పాడనా తీయగా ఎనాడెవ్వరు వినని
గానమే ఊపిరై నాలో మెదిలే కధని
ఉయ్యాలలూగే కనుపాపలో కలని
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగిరికి నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొదలు చిలిపి మనసు గెలవనీ




ససససా  సారి  గరి సరి ససాస
రిరిరిరీగ రిగరిసా రిసగరి
గారీ గరి గరి గరీసా
రీసా రిస రిస రిసగా
గరి గరి సగరి
సాస సాస గాగ గాగ రీరి రీరి రీరి రీరి
సస గరిగ ససరి సరిగా
గగ సరిస గగ రిగరి గగ
గరిగ గగ రిసరి గగ సరిస
గరిస గరి సారీ సరీగా రిగ
సారీ రీగ రిగా సాగ సారీగ
తా దీ గినతోం .. తా దీ గినతోం

https://www.youtube.com/watch?v=IUnHhVMQa_I

No comments:

Post a Comment