Monday, July 6, 2015

poovai putti pooje chesi

మిత్రులకి శుభోదయం

నాకు తమిళ చిత్రాలమీద మక్కువ పెరగడానికి కారణం అయిన చిత్రం కాదల్ ఓవియం 1982 వచ్చింది, భారతి రాజా గారి దర్శకత్వం, తెలుగులో ఈ చిత్రాన్ని రాగమాలిక అని డబ్బింగ్ చేసారు, తమిళం లో చూసాను కాని తెలుగులో చూడడం కాలేదు. రాజా గారి సంగీతం ఈ చిత్రానికి  ఒక గొప్ప వరం, రాధా వచ్చిన కొత్తల్లో చేసారు.

చిత్రం హిట్ కాకపొతే ఎలా మరుగున పడిపోతుందో, ఈ చిత్రం ఒక  ఉదాహరణ, కొందరికి మాత్రం పూవ్వై పుట్టి పూజై చేసి పాట మాత్రం గుర్తుండవచ్చు.

నిన్నే మోహన రాగం గురించి చెప్పా, ఈ పాట కూడా మోహన రాగంలో చెయ్యబడింది, అందుకే ఇంత వినసొంపుగా ఉంది. రాజా మీరు, మీ సంగీతం ఎల్లకాలం నిలిచిపోవాలి,

వేటూరి గారు రాసిన ఈ పాట మీకోసం ఈ రొజు.


పూవ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలి పోనీ "2"
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపొనీ "2"

నీవే నాకు రాగం సాగనీవే హృదయతాళం
గీతం  నీకు హారం దేవి పాదం నాకు తీరం
దేవీ పూజ వేళ రాగామేలే పూల హారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ చైత్ర మాసం
రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం..... ఆ... ఆ ....అ....

తనం ద నం దం దం ద నం దం దం ద
నం దం దం ద నం దం

నాదే సూర్య నేత్రం ఇంకా నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం తీరకుంది తీపి మొహం
వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడి పాడే నాట్య వేదం
నీకే అంకితం .... ఆ.... ఆ ...... ఆ.....

తనం ద నం దం దం ద నం దం దం ద
నం దం దం ద నం దం


https://www.youtube.com/watch?v=a3iE5Ji5Zw0

ఈ క్రింద లింక్ ఓపెన్ చేసి పాటలు వినండి, తప్పకుండా మీకు నచ్చుతాయి.

http://www.inbaminge.com/g/r/Ragamalika/

No comments:

Post a Comment