Friday, July 17, 2015

madura murali hrudaya ravali

మిత్రులకి వందనం

మిత్రులకోసం మరో మోహన రాగ గీతం, ఇళయరాజా, వేటూరి, బాలు, జానకమ్మా ఇంకేం చెప్పాలి పాట హిట్ కాక, సినిమా పేరు చెప్తా "ఒక రాధా ఇద్దరు కృష్ణులు". కోదండరామిరెడ్డి గారి చిత్రం. కమల్ శ్రీదేవి ఇంకేం కావలి. ఎంజాయ్ చెయ్యండి. 

మధుర మురళి హృదయ రవళి 
అధర సుధల యమున పొరలి 
పొంగే ఎద పొంగే... 

ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా 
ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా 

మధుర మురళి హృదయ రవళి 
ఎదలు పలుకు ప్రణయ కడలి 
సాగే సుడి రేగే... 

ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా 
ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా 

గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో 
లేలేత వన్నె చిన్నె దోచే వేళల్లో 

పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో 
నాజూకులన్ని నాకే దక్కే వేళల్లో 

పగలో అవతారం రాత్రో శృంగారం 
ఎదలో తారంగం శ్రీవారికి 

రాగలెన్నైనా వేణువు ఒకటేలే 
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే 
నాదే నీ గీతము.... 
నీదే ఈ సరసాల సంగీతం 

మధుర మురళి హృదయ రవళి 
ఎదలు పలుకు ప్రణయ కడలి 
సాగే సుడి రేగే... 

ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా 
ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా 

హేమంత వేళల్లో లేమంచు పందిట్లో 
నా వీణ ఉయ్యాలూగే నాలో ఈనాడు 

కార్తీక వెన్నెల్లో ఏకంత సీమల్లో 
ఆరాధనేదో సాగే అన్ని నీవాయే 

బుగ్గే మందారం మనసే మకరందం 
సిగ్గే సింధూరం శ్రీదేవికి 

అందాలెన్నైన అందేదొకటేలే 
ఆరురుతువుల్లో ఆమని మనదేలే 
పాటే అనురాగము... 
మన బాటే ఒక అందాల అనుబంధం 

మధుర మురళి హృదయ రవళి 
అధర సుధల యమున పొరలి 
పొంగే ఎద పొంగే... 

ఈ బృందవిహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా 
ఈ బృందవిహారాలలోన నా అందాలు నీవేరా కన్నా 

https://www.youtube.com/watch?v=NknZqDAICpM

No comments:

Post a Comment