బాహుబలి ఒక మంచి ప్రయత్నం
సినిమా రిలీజ్ అయి 3 రోజులు కావస్తోంది చాలా మంది తమ భావాలని ప్రకటించారు, నేను ఎప్పుడు ఏ చిత్రానికి రివ్యూ రాయకపోయినా ఎందుకో రాయాలనిపించింది.
మూడు సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా హిట్ అని కొందరు రాస్తే, హాలీవుడ్ స్థాయిలో ఉంది ఇది మన వాడి సినిమా మనం తప్పకుండా ఆదరించాలి అని కొందరు, కాపి (ఇన్స్పిరేషన్) అని కొందరు ఇలా రక రకాలుగా రాసారు.
ఈ చిత్రా రివ్యూని మూడు భాగాలు గా విభజిస్తా, కధ-కధాగమనం, టెక్నాలజీ-టేకింగ్, నటులు-నటనా.
కధ - కధాగమనం:
కధ కొత్తదేమీ కాదు, చాలా చిత్రాలే వచ్చాయి, కధని నడిపించడంలో కొంతవరకు స్లో అనే చెప్పాలి, మొదటి భాగం అంతా కధలోని పాత్రలని పరిచయం చెయ్యడంలోనే సరిపోయింది, దీనికి కారణం రెండో భాగం మీద ఉత్సుకతని పెంచడమే అనేది నా అభిప్రాయం.
టెక్నాలజీ-టేకింగ్:
మన భారత దేశంలో ఇల్లాంటి టెక్నాలజీ వాడడం కొత్త కాబట్టి కొంతవరకు నిర్మాత దర్శకులు మెచ్చుకోవాలి. టెక్నాలజీ వాడారు కాబట్టి హిట్ చేద్దాం అనుకుంటే పొరపాటే, మిత్రులకి మన వారు ఉపయోగించిన టెక్నాలజీస్ గురించి కొంత చెప్తా. 1950ల్లో వచ్చిన లవకుశ చిత్రం మొదటి దేవా కలర్ చిత్రం, ఆ రోజుల్లో అప్పుడు వారు పెట్టిని బడ్జెట్ ఇప్పుడు వీరు పెట్టిని బడ్జెట్ తో సమానమే, ఆ చిత్రాన్ని నిర్మించడానికి 5 సంవత్సారాలు పట్టిందిట, మిత్రులు గమనిచగలరు అందులోని లవకుశులు ఒక్కో సీన్లో ఓక్కొలా ఉంటారు, చిన్న పిల్లలు కదా పెరిగే వయసు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అల్లూరి సీతారామ రాజు మొదటి స్కోప్ చిత్రం, ఈనాడు ఫస్ట్ ఈస్ట్మెన్ కలర్ చిత్రం, సింహాసనం మొదటి 70mm చిత్రం ఇల్లా ప్రతిసారి కొత్త టెక్నాలజీ వాడిన చిత్రాలు హిట్ కావడం సహజం, కాని పైన చెప్పిన చిత్రాలలో కధ, కధాగమనం, సంగీతం, మాటలు, పాటలు, BMG , ఇల్లాంటి అన్ని departments ఎవరికీ తీసిపోకుండా పనిచేసారు. బాహుబలిలో పైన చెప్పిన డిపార్ట్మెంట్స్ కొంత నిరాశని కలిగించాయనే చెప్పాలి.
నటులు-నటనా:
రమ్యకృష్ణ, సత్యరాజ్ తప్ప మిగతా వారంతా నిరాశ పరిచారనేది నా స్వంత అభిప్రాయం. రానా - ప్రభాస్ లు బాడీ మీద పెట్టిన దృష్టి నటన మీద లేదని చెప్పాలి. కాని ఇల్లాంటి కొత్త హీరోలు ఇల్లాంటి పాత్రలు చెయ్యడానికి ఒప్పుకోవడం నిజంగా ప్రసంసనీయం. తమన్నా తనకు మించిన ప్రయత్నం చేసింది. అనుష్కకి నటనాస్కారం లేదు కాబట్టి నేనేం మాట్లాడడం లేదు.
నిన్న సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత ఏదైనా సీన్ గురుస్తుందేమో అని ప్రయత్నం చేశా ఒక్క రమ్యకృష్ణ బాబుని రక్షించడం కోసం చేసిన ప్రయత్నం తప్ప వేరే దృశ్యం గ్యప్తికి రాలేదు.
అయ్యా ఒక్క మనవి నిర్మాతా దర్శకుల ప్రయత్నాన్ని సుమనస్కంగా అభినందిస్తున్నా. కాని ఇంకా చెయ్యగలం, ఇంకా గొప్ప చిత్రాలని నిర్మించాగలం ఇది గుర్తుంచుకోండి.
ఒక్క సారి చూడగలను అంతే

No comments:
Post a Comment