Saturday, July 11, 2015

tellavaara vacche teliyaka naa saami

మిత్రులకి వందనం

మోహన రాగం ఎంత సుమధురంగా ఉంటుందో చిరంజీవులు చిత్రంలోని తెల్లవారవచ్చె తెలియక నా సామి పాట వింటే తెలుస్తుంది, లీలమ్మ ఎంత మధురంగా పాడారో ఘంటసాల వారి సంగీత సారధ్యంలో. మల్లాది రామకృష్ణ గారి రచన చూడండి ఎంత బాగుంటుందో. చాలామంది ఇది దేవులపల్లి వారిదని, కొందరు సముద్రాల వారిదని అంటారు కాని ఇది మల్లాది వారిదే అని నా ఉద్దేశం.

చిన్నప్పుడు సింహాచలంలో శీతాకాలంలో ధనుర్మాసంలో తెల్లవార్ఝామునా మేలుకోలుపులలో ఈ పాట కూడా పాడేవారం.

వీడియో అంత క్లియర్ గా లేదు, అందుకు  పాట లింక్ ఒకటి పెట్టా వినగలరు.



తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు...
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు...
మారాము చాలింకలేరా.... మారాము చాలింకలేరా

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయ నిదురలేరా

నల్లనయ్య రా రా నను కన్నవాడా బుల్లి తండ్రి రా రా బుజ్జాయి రా రా
నల్లనయ్య రా రా నను కన్నవాడా బుల్లి తండ్రి రా రా బుజ్జాయి రా రా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రా రా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రా రా
వెన్న తిందువుగాని రా రా


https://www.youtube.com/watch?v=41XDTvI3mpA


http://www.allbestsongs.com/telugu_songs/searchlyrnew.php?st=Malladi%20Ramakrishna%20Sastri





No comments:

Post a Comment