మిత్రులకి శుభోదయం
తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు.
మచ్చుకకి తెలుగులో వచ్చిన కొన్ని సినిమా పాటలు చూద్దాం, మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు) లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్), ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు), మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం), వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం), పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు), నిన్ను కోరి వర్ణం… (ఘర్షణ), సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ), మౌనముగా నీ మనసు పాడినా… (గుండమ్మ కధ), చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ), పులకించని మది పులకించు… ( పెళ్ళికానుక) ఇల్లా ఎన్నో పాటలు, అంత పెద్ద పీట ఈ రాగానికి. అన్ని నాకు ఇష్టమైన పాటలే.
పింగళి గారి రచన, పెండ్యాల వారి స్వరకల్పన చేసిన ఈ పాటని సుశీలమ్మ ఘంటసాలగారు ఆలపించారు.
మోహన రాగమహా మూర్తిమంత మాయే "2"
నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
చిత్ర సీమలో వెలయగ జేసి దివ్య గానమున జీవము పోసీ
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియెయనగా
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపమురాగా
ఆరాదించిన ప్రియభావనిలా పరవసించెననగా
https://www.youtube.com/watch?v=eK-FwH5wCHk

No comments:
Post a Comment