మిత్రులకి శుభోదయం
ఏదో ఇలా వచ్చి వెళ్ళిపోయింది ఈ సంవత్సరం వాన, మళ్ళి వేడి మొదలైంది, చిన్నప్పుడు వానలు కురవాలని కప్పల పెళ్ళి చేసేవారం, ఇప్పటి జనాలకి తెలుసో లేదో!
MS రాజు గారు వాన అనే చిత్రాన్ని నిర్మించారు, కమలాకర్ సంగీతం, రెండు పాటలు బాగుంటాయి, ఆకాశ గంగా, ఎదుట నిలిచింది చూడు, రెండూ కార్తిక్ పాడారు. ఒరిజినల్ గా కన్నడాలో నిర్మించన ముంగారు మాలే చిత్రానికి రీమేక్ ఈ చిత్రం అక్కడ సోను నిగమ్ చాల అద్భుతంగా ఆలపిస్తే ఇక్కడ కార్తిక్ శ్రావ్యంగా పాడారు.
శాస్త్రి గారి రచన, వారికి గంగావతరణం గుర్తొచ్చి ఉంటుంది ఆకాశ గంగని దూకించారు.
ఆకాశ గంగా దూకావే పెంకితనంగా
ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగ నిలబడు సడిగా
నా తలపు ముడివేస్తున్న నిన్నాపగా
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వానా
మెరుపుల గాలి కనుమరుగైనా
నా గుండెలయలో విన్న నే అలికిడి
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాట లోనైనా నీ పైటనోదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతిమలుపు తెలుపవే అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
https://www.youtube.com/watch?v=2vox_q4PkJY
https://www.youtube.com/watch?v=uSXIQaP6uYA
No comments:
Post a Comment