మిత్రులకి శుభోదయం
మిత్రులు కొందరికి తెలిసి ఉండవచ్చు రాగమాలిక గురించి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు పాటల్లో ఈ రాగమాలిక ప్రయోగం ఉండేది, ఈ మద్య తగ్గింది, అక్కడక్కడ వినిపిస్తున్నాయి. రాగమాలిక అంటే కొన్ని రాగల సరాగామాల. రమేష్ నాయుడు గారు మనకి ఒక వరం, వారు తెలుగు వారు కావడం మన అదృష్టం, దాసరి వారి శివరంజని చిత్రం ఒక గొప్ప మ్యూజికల్ హిట్. అందులో నారాయణరెడ్డి గారి అభినవ తారవో మాట ఈ రాగమాలికలో చెయ్యబడింది.
శివరంజని నాయికి పేరు కావడంతో సినిమాకి కూడా అదే పేరు పెడితే, పల్లవి కూడా అదే రాగంతో ప్రారంభించి, మలయమారుతం మొదటి చరణం లో, సరస్వతి రెండవ చరణంలో, కళ్యాణి మూడవ చరణంలో వాడారు. నాయికిని అభిమానించే ఆ నాయకుడు పాడే ఈ పాట మీకోసం. బాలు గారు పాడారని చెప్పాలా?
ఒరిజినల్ వీడియో దొరకలేదు కాని మాహానుభావుడు రెడ్డి గారి ఫోటో ఉన్న వీడియో ని సొదరులెవరొ పెట్టారు వీక్షించండి.
(శివరంజని)
అభినవ తారవో...నా అభిమాన తారవో
అభినవ తారవో..అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ
శివరంజనీ...శివరంజనీ
(మలయమారుతం)
అది దరహాసమా మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
నా తరుణ భావనా హరిణమ్ములా
(సరస్వతి)
ఆ నయనాలు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
రవళించును పదకవితా ప్రబంధాలు
(కళ్యాణి)
నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణ రసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా నీ కుపితనేత్ర సంచారమే..
హాస్యమా నీకది చిటికలోన వశ్యమే
నవరస పోషణ చణవని
నటనాంకిత జీవనివని
నిన్ను కొలిచి ఉన్నవాడ
మిన్నులందు కున్నవాడ
నీ ఆరాధకుడను...ఆస్వాదకుడను..అనురక్తుడను
నీ ప్రియభక్తుడను
https://www.youtube.com/watch?v=soevD3Tj5FA

No comments:
Post a Comment