Wednesday, July 8, 2015

amma donga ninnu choodakunte

మిత్రులకి వందనం

ఎందుకో  ఈ రోజు సినిమా పాట కాకుండా లలితా సంగీతం నుంచి ఒక పాట మిత్రులకి గుర్తుచేద్దాం అనిపించింది, రాజేశ్వరరావు గారి నుంచి నేటి రామాచారి గారి వరకు ఎందరో మహానుభావులు లలితా సంగీతం మనకి అందించారు. ఎనభైల ముందు పుట్టిన వారికి లలిత సంగీతం గురించి తెలియ వచ్చు, రేడియో లో TV లు వచ్చిన కొత్తల్లో ఎన్నో లలిత గీతాలు వచ్చేవి. వేదవతి ప్రభాకర్, H . హేమవతి, సురేఖ మూర్తి ఇలా ఎందరో పాడేవారు.

నాకు బాగా ఇష్టమైన పాటలు, మాధూదయంలో మంచి ముహర్తం (దేవులపల్లి వారి రచన, సాయిబాబా సంగీతం), అమ్మ దొంగా నిన్ను చూడకుంటే ( పాలగుమ్మి విశ్వనాధం రచన సంగీతం రెండు ).

 ఈ రోజు మీకోసం ... ఈ పాట తల్లులందరి కోసం,

@surekha  మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు

అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ!


కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడుపేవు



కథ చెప్పేదాక కంట నిదర రాక
కథ చెప్పే దాక నీవు నిదర పోక
కథ చెప్పే దాక నన్నుకదలనీక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు



ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోయినా? గూడు నిదురపోవునా?



నవ్వితే నీ పళ్లు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక వుంటే అది చాలు/పదివేలు
కలతలు, కష్టాలు నీ దరికి రాక
కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి


https://www.youtube.com/watch?v=41F4JL5w0xM

https://www.youtube.com/watch?v=6RV4r-lh3w0

No comments:

Post a Comment