Monday, July 27, 2015

komma kommako sannayi

మిత్రులకి శుభోదయం

తెలుగు అందగాడు అంటే ఆనాటి ఆడవారికి అందరికి ఇష్టమే, వారి భర్తలు శోభన్ బాబు లాగా ఉండాలని (అందంలో) కోరుకునే వారంట, ప్రతి సినిమాలోను అతనికి ఇద్దరు భార్యలుంటారని ఒక ఫిర్యాదు ఉన్నా, వారే అయిన్ని ఎక్కువగా అభిమానించారు. అయిన సుజాత తో కలిసి చేసిన దాసరి గారి గోరింటాకు చిత్రం ఆరోజుల్లో సూపర్ హిట్. మహదేవన్ సంగీతం వేటూరివారి సాహిత్యం, ప్రతీ కొమ్మ సన్నాయి పట్టుకొని ఉదాయి. వేటూరి వారి గీతాల సంకలనానికి పేరు కూడా ఈ పాట పల్లవే "కొమ్మ కొమ్మకో సన్నాయి".



కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతను చూడు(2)
పసితనాల తొలి వేకువలో
ముసురుకున్న మబ్బును చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి.......

కొంటె వయసు కోరికలాగ
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బంధం చూడు(కొంటె)
ఒడ్డుతోనూ...నీటితోనూ
పడవ ముడి పడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో)

https://www.youtube.com/watch?v=Et9LdWwL5I0

No comments:

Post a Comment