Saturday, July 11, 2015

alanaati ramachandrudu

మిత్రులకి శుభోదయం

ఈ రోజు యనమంద్ర వెంకట సుబ్రమణ్య శర్మ  (మణిశర్మ) గారి జన్మదినం, అయ్యా మీకు జన్మదినశుభాకాంక్షలు.
ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీ Y N  శర్మ గారి అబ్బాయిగా పరిచయం అయినా! తనకంటూ మెలోడీ మాంత్రికుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మణి. Y N శర్మ గారి గురించి చెప్పాలంటే ఎన్నో చిత్రాలకి  వయిలిన్ అందించారు, మీకందరికీ బాగా తెలిసిన "జోరుమీదున్నావు తుమ్మెదా" పాటలో వచ్చే వయిలిన్ బిట్స్ వారు అందించినవే.

మణి మొదటి గురివు వారి నాన్నగారు అయితే, సత్యం మాస్టారు (డోలక్ సత్యం ) గారి దగ్గర మొదట కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసారు, తరువాత రాజా గారి దగ్గరా, రాజ్-కోటి, MM కీరవాణి ఇలా చాలామంది దగ్గర పనిచేసి తరువాత సొంతం గా చిత్రాలు చేస్తూ అనతి కాలంలోనే వంద చిత్రాలను పూర్తి చేసారు. ప్రారంభంలో  బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా మొదలు పెట్టారు, అంతం, రాత్ లాంటి చిత్రాలతో, ఇప్పటికి నాకు తెలిసి రాజా గారి తరువాత ఎంతో గొప్ప బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలరు మణి, ఈ మద్య వచ్చిన సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు చిత్రానికి మణే BGM.

నాకు బాగా ఇష్టమైన మణి గారు చేసిన చిత్రాలు, మార్నింగ్ రాగ, ఇంద్ర, చూడాలని ఉంది, మురారి, ఒక్కడు, అతడు, రావోయి చందమామ, ఖలేజా, ఇలా ఎన్నో చిత్రాలకి మంచి సంగీతం అందించారు మణి.

జిక్కి లాంటి గొప్ప గాయనిమణి ని మురారి చిత్రం లోని అలనాటి రామచంద్రుని పాటతో  మనకి మళ్ళి వినిపించారు. శాస్త్రి గారి రచన పాటని ఇంకొక మెట్టు పైకి ఎక్కించింది అని చెప్పాలి. తెలుగు నాట జరిగే ప్రతి పెళ్ళిలోను ఈ పాట వినిపిస్తుంది, ప్రతి పెళ్ళి CD లోను ఉంటుంది అంతటి ప్రఖ్యాతి పొందింది ఈ పాట. కృష్ణ వంశి చక్కగా చిత్రీకరించారు, మహేష్ పెళ్ళి కొడుకంటే ఇలాగే ఉండాలన్నంత ముద్దుగా ఉన్నాడు, సొనాలి కూడా!

కోరస్ లో వెన్నేలమ్మ వెన్నేలమ్మ అంటూ పాడతారు, వెన్నెలమ్మ అనాలనుకుంటా పెద్దలు చెప్పగలరు

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెనుగింటి పాల సంద్రము కనిపించిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందామామ చందామామ కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి 

https://www.youtube.com/watch?v=2cmWLJyTKjc




No comments:

Post a Comment