మిత్రులకి శుభోదయం
అంగవైకల్యం శరీరానికి కాదు, మనిషి మనసుకి, వారి మనస్తత్వానికి అని ఎందరో differently abled people నిరూపించారు, వారిలో ఒకరు సుధాచంద్రన్, తన పదహారో ఏట ఒక కార్ ఆక్సిడెంట్లో కుడి కాలు పోగుట్టుకున్నారు, చిన్నతనం నుండి భరతనాట్యం నేర్చుకున్న తను ఆక్సిడెంట్ తో కుమిలి పోకుండా జైపూర్ ఫుట్ ద్వారా తిరిగి తన నృత్యాన్ని కొనసాగించారు, ఆమె జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని సింగీతం శ్రీనివాసరావు గారు మయూరి చిత్రాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి మనకి అందించారు. ఎన్నో గొప్ప చిత్రాలని నిర్మించన ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే రామోజీరావు గారు ఈ చిత్రం ద్వారా సుధా చంద్రన్ ని, అలాగే అశ్వని చిత్రంతో పరుగుల రాణి అశ్వని నాచప్పని, కెమెరామాన్ తేజాని డైరెక్టర్ గా, కులశేఖర్, R P, ఉదయ కిరణ్, రీమాసేన్, హీరో గా jr NTR, తరుణ్ ఎందరినో పరిచయం చేసారు.
అలాగే మ్యూజిక్ directors గా మయురికి బాలుగారిని, మౌన పోరాటం లో జానకమ్మ చేతా చేయించి వారిలోని వేరే కోణాన్ని మనకి రుచి చూపించారు.
ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆణిముత్యాలే, అందెలు పిలిచిన అలికిడిలో పాట అంటే మరీ ఇష్టం నాకు, వేటూరి గారి రచన, జానకమ్మ శ్రావ్యమైన గొంతు, సుధాచంద్రన్ నృత్యం బాలుగారి సంగీతాన్ని మరింత మనికి చేరువ చేసాయి.
నాకు నృత్యం మీద అభిరుచి పెంచిన ఈ చిత్రంలోని ఈ పాట మిత్రుల కోసం ఈ రోజు.
రెండవ చరణం ముందు వచ్చే interload వినండి బృందావన సారంగ ఎంత శ్రావ్యంగా ఉంటుందో!
బాలుగారు దాసోహం మీకు, పాట మొత్తం సహజమైన వాయిద్యాలు వినిపిస్తాయి మృదంగం, వీణ, వేణువు, షెహనాయి లాంటివి
అందెలు పిలిచిన అలికిడిలో...
అణువణువునా అలజడులు
ఎద పదమొకటవ్ లాహిరిలో(2)
ఎన్నడు ఎరుగని వురవడులూ
ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది జీవన హేల(ఇది)
ఇది నా ప్రియ నర్తన వేళ....యా....
ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా
ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా(ఉత్తరాన)
ఒక కదలిక చిరు మెదలిక
గిలిగింతగా జనియించగా(ఒక)
నాలుగు దిక్కులా నడుమ పుడమి
నా వేదికగా నటనమాడనా(నాలుగు)
అనంత లయతో నిరంతగతితో
జాతులు పాడనా ఆడనా(ఇది)
మేఘ వీణ చలి చినుకు చిలికినా
మేనులోన చిరు అలలు కదిలినా(మేఘ వీణ)
ఒక లహరిక మధు మదనిక
వలవంతగా జనియించగా(ఒక)
సుగమనిగమ సుధా ఎడద పొంగగా
వరదలాగ ఉప్పొంగనా(సుగమనిగమ)
వరాళి యెదలో స్వరాల రొదలో
పదము పాడనా ఆడనా(ఇది)
https://www.youtube.com/watch?v=0EDBAtbybr8
https://www.youtube.com/watch?v=oxq6GwhGW8k