మిత్రులకి వందనం
కొన్నిరోజుల క్రితం లలిత సంగీతం నుంచి వేదవతి ప్రభాకర్ గారి పాట మిత్రులకి గుర్తుచేసా, లలిత సంగీతంలో చిత్తరంజన్ గారు ఎంతో కృషి చేసారు, ఎన్నో మంచి పాటలు చేసారు, వారి చెల్లిగారు శాంతాచారి గారిచేత పాడించిన బోయిభీమన్న గారి ఏ గాలి వడి రాలి పాట చూద్దాం ఈ రోజు.
సూపర్ సింగర్ 8 లో నిఖత అనే అమ్మాయి ఈపాట కీరవాణి చిత్రాల ముంది పాడినప్పుడు విన్నా, ఒరిజినల్ రికార్డు (నేను కూడా పాత కాలం వాళ్ళలా రికార్డు అనే పదం వాడుతున్నా) ప్రయత్నించగా దొరికింది.
బోయి భీమన్న గారంటే కేవలం దళిత సాహిత్యం అనుకుంటారు, ఎంత గొప్పగా రాసారో, అచ్చతెనుగు పదాల అల్లిక ఎంత బావుందో.
specially this song for @choodaamani , @sailajavissamsetti, @indirapriyanka @TPraghavachari @stpsrikanth @bhagyasree
ఏ గాలి వడి రాలి
ఏ ధూళి దోగినదో
ఏ కబరి ముడి సడలి ఏ దారి జారినదో
ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల
ఏ రమణి మకుట లీలా మంజరీ చ్యుతము
ఏయసంకృత కుంతలా యదాతధ కృతము
ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల
మధుమాస మాధురులు మాసి పోయే దారి
ఆదుకున్నా ఎదకు ఆనందమిడు నోయి
ఎత్తవోయీకేల ఈ బేల సుమబాల
https://www.youtube.com/watch?v=ICI0ibIARkM
https://www.facebook.com/hymavathi.kothuri/videos/vb.100004201384535/398903966926313/?type=3&permPage=1
https://www.youtube.com/watch?v=VJNr7sI00Xw
https://surasa.net/music/lalita-gitalu/air_rburra/Ethavoyee.mp3
ReplyDelete