మిత్రులకి వందనం
భారతదేశ చలచిత్ర చరిత్రలో వేళ్ళమీద లెక్కపెట్టే గొప్ప సంగీత దర్శకులలో ఓపి నయ్యర్ ఒకరు. రోషన్, మదన్మోహన్, ఓపి నయ్యర్, SD బర్మన్, ఇళయరాజా, ఆదినారాయణరావు, సుసర్ల దక్షణామూర్తి, M S విశ్వనాథన్, మహదేవన్, ఘంటసాల గారు ఇలా నాకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుల లిస్టు. మిగతా వారంటే ఇష్టం లేదు అని కాదు, రాముడు మంచి బాలుడు అంటే లక్ష్మనుడొ, భరతుడొ చెడ్డవారు అనికాదుకదా. మంచి సంగీతం ఎవరిచ్చినా ఆనందిస్తాం.
నాకు తెలిసి ఓపి గారు నీరాజనం ఒకటే తెలుగులో చేసారు. వేరే ఏవైనా చిత్రాలు ఉంటే మిత్రులు తెలియ చేయగలరు. భారతదేశం మొత్తం సగర్వంగా మా గానకోకిల అని చెప్పుకునే లతా మంగేష్కర్ చేత ఒకే ఒక్క పాట ఓపి పాడించారనే విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది, అదికూడా ఎప్పుడో 1956లో ఆమె రోషన - ఫారుఖ్ ల సంగీత సారధ్యంలో పాడిన పాటని తిరిగి 1970లో టాక్సీ డ్రైవెర్ లో తిరిగి ఆమె చేతే పాడించవలసి వచ్చిందంట.
నీరాజనం లో అన్ని పాటలు చాలా బాగుంటాయి, ఘల్లు ఘల్లునా, మనసొక మధుకలశం, ఊహల ఊయలలో, నినుచూడక నేనుండలేను. ఇలా అన్ని సూపర్ సూపర్.
మిత్రులు గమనించండి బాలు గారి గొంతు రెగ్యులర్ గా తను పాడే తెలుగు పాటలలా కాకుండా సాజన్, మైనే ప్యార్ కియా లాంటి హిందీ చిత్రాలలోని ఆయినా గొంతులా ఉంటుంది. జానకి గారితో కలిసి పాడిన నినుచూడక నేనుండలేను పాటని నారాయణరెడ్డి గారు రచించారు.
ఒక ఖవ్వాలి లా, ఒక ఘజల్లా ఎంత బాగుంటుందండి ఈ పాట, మై అల్ టైం ఫేవరేట్.
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక యే జన్మకైన ఇలాగే
యే హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకొంటినీ
యే చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
నీ జత కూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
https://www.youtube.com/watch?v=dpbqVITS6Ng
No comments:
Post a Comment