మిత్రులకి వందనం
వంశీ గారి చిత్రాలంటే నాకు భలే ఇష్టం, దానికి రెండు కారణాలు వారి చిత్రాలలో కధలో కొత్తదనం, వారి చిత్రాలకి ఎక్కువగా రాజా గారి సంగీతం. almost అన్నీ నా ఫేవరేట్ మూవీసే, చిరంజీవి గారి మంచుపల్లకి తో ప్రారంభించి, సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్, మహర్షి, చెట్టు కింద ప్లీడర్, డిటెక్టివ్ నారద, జోకర్, ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి ఎన్నో చిత్రాలు చేసారు, డైరెక్టర్ గానే కాకుండా సంగీత దర్శకుడిగా, జోకర్, కన్నయ్య కిట్టయ్య, నీకు 16 నాకు 18, ప్రేమ అండ్ కో, లింగబాబు లవ్ స్టొరీ చిత్రాలు చేసారు. వారికి సంగీతం మీద ఉన్న అభినివేశం వలన వారి అన్ని చిత్రాల్లోనూ సంగీతం ప్రధాన ఆకర్షణ.
ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రం లోని అన్ని పాటలు సూపర్ హిట్, ఒంపుల వైఖరి, చుక్కలు తెమ్మన్న ఈ రెండు పాటలు నాకు బాగా ఇష్టమైన పాటలు. ఈ రోజు మీకోసం బాలు చిత్ర లు పాడిన, శాస్త్రి గారి రచనలో వచ్చిన ఒంపుల వైఖరి మీకోసం.
సీతారామ శాస్త్రి గారి కలం ఎన్నో ఒంపు సొంపులు తిరిగింది, చెప్పాలంటే వారి జర్నల్ కాని పాటలా ఉంటుంది, చెప్పకపోతే వేటూరి వారిది అనుకోవచ్చు, ఎందుకంటే మోవిని మగతావిని లాంటి ప్రయోగం శాస్త్రి గారి రచనలో వినపడవు, కవి అంటే అన్ని రకాలుగా రాయాలి కదా అందునా శాస్త్రి గారికి కలానికి రెండు పాళీలు, ఇందుమతి చారు మతి అనికూడా అన్నారుకదా వారు.
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
మొవిని మగతావిని ముడి వేయనీయవా
కాదని అలలేనని గడియైన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి
హద్దు పొద్దులేని ఆరాటం ఆపాలి
కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
తీక్షగా ఓర్చుకున్న మొక్షమే ఉండదా
శ్వాసలో మొహదాహం గ్రీష్మమై వీచగా
వాంచతొ వేగు దేహం పరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
నిష్ఠగా నిన్ను కోరీ నీమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే ఓచనా
నిగ్రహం నీరుగారి జ్వాలలో నింపినా
నేర్పుగా ఈది చేరి నిశ్చయం బెట్టనా
సోయగం స్వంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
https://www.youtube.com/watch?v=5xyyhECcC1k

No comments:
Post a Comment