Tuesday, August 4, 2015

abhinandana mandaara maalaa

మిత్రులకి వందనం

ర"సాలురు" రాజేశ్వరరావు గారంటే మనకి అమితమైన ప్రేమ, వారు చేసిన పాటలు ఆణిముత్యాలు, తాండ్రపాపారాయుడు చిత్రానికి కూడా వారే సంగీతం అందించారు, కృష్ణంరాజు గారే నిర్మించిన ఈ చిత్రానికి దాసరివారు దర్శకత్వం వహించగా, జేసుదాసు గారు సుశీలమ్మ పాడిన ఈ గీతాన్ని నారాయణరెడ్డి గారి కలం నుంచి జాలువారింది.

వీడియో ట్రై చేసా దొరకలేదు, అందుకే నేనే ఏదో వీడియో చేసి పెడుతున్నా, మిత్రులు  ఎవరికైనా దొరికితే పెట్టగలరు,


అభినందన మందారమాల... (3)
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాల...
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల

వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా॥
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా (2)
నీ చూపు నా రూపు వరియించెనా
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా...
దివి తానే భువిపైన దిగివచ్చెనా
అభినందన మందారమాల...
అలివేణీ స్వాగతవేళ...
అభినందన మందారమాల
సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల
నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల

వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో॥
సగము మేనిలో ఒదిగిన దేవత (2)
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల
ఉభయాత్మల సంగమ వేళ
అభినందన మందారమాల

https://www.youtube.com/watch?v=gJdzh8WJ75g


No comments:

Post a Comment