Friday, August 7, 2015

chitti gumma padave

మిత్రులకి వందనం

అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా దివ్య భారతి, కేవలం 3-4 సంవత్సరాలలో తెలుగు తమిళ్ హిందీ భాషలలో పలు చిత్రాలు చేసి, మంచి హిట్స్ కొట్టారు, ఆరోజులలో ఆమె ఫొటోస్ నోట్ బుక్స్ లో పెట్టుకున్నెంత ఇష్టం నాకు, ఇప్పటికి తనుచేసిన బొబ్బిలి రాజా, ధర్మక్షేత్రం, అసంబ్లీరౌడి, రౌడి అల్లుడు, తొలిముద్దు లాంటి తెలుగు చిత్రాలు, షోలా ఔర్ శబ్నం, దీవానా, విశ్వాత్మా లాంటి చిత్రాలు చూస్తూ ఉంటా. ఒక్క 1992 లోనే తెలుగు లో రెండు చిత్రాలు హిందీ లో పది చిత్రాలు వెరసి 12 చిత్రాలు చెయ్యడం అంటే ఊహించండి ఎంత పాపులారిటీ వచ్చిందో తనకి ఆరోజులలో.  తొలిముద్దు చేసే రోజుల్లో ఆమె మరణిస్తే రంభని పెట్టి చిత్రం పూర్తి చేసారంట. ఈ రోజు ఆ చిత్రంలోని నాకు బాగా ఇష్టమైన చిట్టి గుమ్మ పదవే పాట మీకోసం, బువనచంద్ర గారి సాహిత్యం, మాస్ట్రో ఇళయరాజా సూపర్ మ్యూజిక్ వెరసి నా ఆల్ టైం ఫేవరేట్.

రెండవ చరణం ముందు వచ్చే ఇంటర్ లోడ్ లో మురళీ గానం వినండి!
"రాజా గారు గాడ్ బ్లెస్ యు."


చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరు గాలై కొండా కోనల్లోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి


కడలి అంచుల్లో జలకాలాడి అల లా అంతూ పొంతూ చూసొద్దామా
యమహో ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడే వయసు హద్దు పొద్దు తెలుద్దామా
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా
తరగని మొహాలే వేసాయే వలలో తడి తడి వంపులలో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో పెదవుల తాంబూలం అందీవే
తనువిచ్చెయ్ మంటోంది మనసొద్దొదంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మా రెమ్మా ఊగాడింది

చలిలో చిన్నారి వయ్యారాలే  కసి గా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ఉసిగా తట్టి తట్టి వేదిస్తుంటే
వలపుల కౌగిళ్ళా నజరానాలే  రతిలా మళ్ళి మళ్ళి అందిస్తుంటే
మరుడే వొళ్ళోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో తలుపులు తీవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలి జడిలో తకదిమి సాగించెయి బుల్లోడా
ఇహ  అడ్డేముందంమ్మొ  మలి ముద్దిచ్చేయ్  వమ్మొ 
మెరుపల్లే బాణం సందించెయ్  వీరా ధీరా

https://www.youtube.com/watch?v=O1AmEm6Yl1o


No comments:

Post a Comment