మిత్రులకి శుభోదయం
ఈ మద్య కొన్ని మంచి పాటలు వస్తున్నాయి, శ్రీమంతుడు సినిమా చూసా చాలా బాగా తీసారు కొరటాల శివ గారు, ఈ మద్య వచ్చిన గేయ రచయతలలొ @ramajogaiahsastrydarivemula ఒక మంచి రచయత, మంచి పాటలు రాస్తున్నారు. ఖలేజా చిత్రం లో సదాశివ సన్యాసి పాట మనకి బాగా తెలిసిన పాట అది వీరు రాసినదే.
సింగల్ కార్డు రాయడం ఈ మద్య తగ్గిందనే చెప్పాలి, వేటూరి, సీతారామశాస్త్రి గార్లతోనే అది ఆగిపోయింది, ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు మళ్ళి శ్రీమంతుడు లో అన్ని పాటలు రాసి ఆ క్రెడిట్ కొట్టారు.
టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది, ఈ రోజు రామజోగయ్య శాస్త్రి గారి పుట్టిన రోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు.
అయ్యా చెవులకు వినిపించే లాగ పాటలు రాస్తున్నారు, ఇంకా మంచి పాటలు రాయండి. ఒక్క మనవి ఇతర భాషా గాయకులు పాడడం చేత కొన్ని తప్పులు వస్తున్నాయి, diction బాగుండడం లేదు, దయచేసి వారు పాడినప్పుడు మీరు కూడా ఉండండి, ఇది చాలా కాలంగా ఉన్న సమస్యే కాని మంచి అర్ధం ఉన్న ఇల్లాంటి పాటల విషయంలో కొంచెం జాగ్రత్త పడితే, పదికాలాలు నిలుస్తుంది. MLR కార్తికేయ పాడిన ఈ పాట DSP చేసారు.
ఓ నిండు భూమి నిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా
పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా
గుండె దాటుకొని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా
ఋణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా
ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందో మది మాటకైన మరి తలచినదా
మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా
మరలి మరల వెనుతిరగనన్న చిరు నవ్వే నీకు తొలి గెలుపు కదా
మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా
లోకం చీకట్లు చీల్చే గేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం
సాయం సమాజమే నీ ద్యేయం నిరంతరం
కోరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం
విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా
ఎదురు చూసే యెదను మీటే పవనమయి పద పదరా
లేనిదేదో పనిలేనిదేదో విడమరచి చూడగల ఋషి గుణమా
చిగురు మురిసే చినుకుతడిగ పయనమై పద పదరా
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో లక్ష్యానికి జై హో
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలన్నీ సాకారమవగా జై హో
https://www.youtube.com/watch?v=SqUcNqAYw84
No comments:
Post a Comment