Saturday, August 15, 2015

avuraa ammaku chella

మిత్రులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నేను చెప్పినట్టే చిరంజీవి గారి పాటలు వరసలో ఈరోజు విశ్వనాధ్ గారి దృశ్య కావ్యం ఆపద్భాంధవుడు నుంచి

ఔరా అమ్మక చల్లా పాట.

కీరవాణి గారు మొదటిసారి విశ్వనాధ్ గారితో పనిచేసారు. సీతారామశాస్త్రి గారు రాసిన ఈ కృష్ణ గీతం అంటే నాకు పరమప్రీతి. 20సంవత్సరాల క్రితం అనుకుంటా శాస్త్రి గారితో కలిసి సింహాచలం సింహాద్రినాధుని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో వారిచేత ఈ పాట పాడించుకున్నము, కేవలం ఈ రెండు చరణాలే కాకుండా వారి యుక్తవయస్సులో రాసుకున్న మిగతా చరణాలు కూడా వినే భాగ్యం కలిగింది.

తెలుగు చలనచిత్రానికి కొత్త నడవడిక నేర్పిన చిరంజీవి కేవలం పోరాటాలు, నృత్యాలేకాదు!  తను అధ్బుతమైన నటనని, వాయిస్ modulation కూడా ఇవ్వగలడు అని నిరూపించిన చిత్రం. మీనాక్షి అందం అభినయం మరిచిపోలేను. మంచి శాస్త్రీయ నృత్యం తెలిసిన నర్తకీమణి కావడం పాత్రలో ఆమెను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేకుండా చేసారు.




ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లాఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

ఆల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాలా  
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

https://www.youtube.com/watch?v=SMclX5HG960

No comments:

Post a Comment