Tuesday, August 18, 2015

guvva gorinka to

మిత్రులకి శుభోదయం

చిరంజీవి గారి నా అల్ టైం హిట్ గువ్వా గోరింకతో, ఖైది నెo 786 చిత్రం లోనిది, రాజ్ కోటి ద్వయం చేసిన ఈ పాట బాలు జానకి పాడితే వేటూరి గారు సాహిత్యం అందించారు.

విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు హిట్. చిరంజీవి గారితో చాలా చిత్రాలు చేసారు బాపినీడు, మీకందరికీ తెలిసిన సూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ (ఫ్లాప్ అనుకోండి), మగధీరుడు, మహానగరం లో మాయగాడు, హీరో  లాంటి చిత్రాలు.

perfect  డాన్సు స్టెప్స్ వేస్తారు చిరు, తనకి మంచి డాన్సర్ తోడైతే ఇంకేముంది సూపర్ హిట్ పెయిర్ అవుతుంది. మిత్రులు గమనిచండి ప్రతీ స్టెప్ క్లోసింగ్ ఎంత చక్కగా చేస్తారో ఇద్దరు. ఎంతైనా చిరంజీవి నుంచి కళ్ళు తిప్పుకోలేము అనుకోండి పక్కన ఎంత పెద్ద హీరోయిన్ అయినా.

పాట స్టార్టింగ్ బాలు గారి ఆలాపన వినండి ఎంత సునాయాసంగా పాడారో, ధన్యులం మేము మీరు తెలుగు వారు కావడం.

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీణ  పాట
ఆడుకొవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై

జొడు కొసం గొడ దూకే వయసిది   తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో    పాపం  అంత తాపం  తగుదులె తమరికి అబ్బాయిగరు
ఆత్రము   అరాటము చిందే వ్యామొహం    
ఊర్పులొ   నిట్టూర్పులొ అంతా నీ ధ్యానం  
కొరుకున్ననని ఆట  పట్టించకు
చెరుకున్నానని నన్ను దోచేయకు    
చుట్టుకుంటాను సుడిగాలి

కొండ నాగు తొడు చేరి నాగిని  బుసలలో  వచ్చే సంగీతం
సందె కాడ  అందగత్తె పొందులొ ఉందిలే  ఎంతో సంతొషం 
పువ్వులొ మకరందము  ఉందె నీ కొసం     
తీర్చుకొ ఆ దాహము  వలపే జలపాతం
కొంచం ఆగాలిలే కొరిక తీరేందుకు     
దూరం ఉంటానులే దగ్గరయ్యెందుకు     
దాచిపెడతాను నా సర్వము


https://www.youtube.com/watch?v=gW_L9EDh2C4

No comments:

Post a Comment