Friday, August 21, 2015

మిత్రులకి వందనం

ఈ రోజు శనివారం అందునా చిరంజీవి గారి బర్తడే కూడా, బంగాళా భౌ భౌ అని వంటకం ట్రై చెయ్యకూడదు, హ హ హ హ  వాట్ ఎ కామిడి అండి. చిరంజీవి గారు డాన్సులు ఫైట్లు కాదు అద్భుతమైన కామిడి చేస్తారు. ఇప్పుడే E T V లో చంటబ్బాయి వస్తూ ఉంటే చూస్తున్నా. పాండ్ జేమ్స్ పాండ్.... ఇదిగో చూడండి మిస్ జ్వాలా మిమ్ములని కొన్ని ప్రశ్నలడగాలి... ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సూపర్ సినిమా. థాంక్స్ టూ జంధ్యాల గారు. మల్లాది వారి నవల ఆధారంగా తీసిన చిత్రం ఇది.

1986 లో ఇదే రోజున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భముగా రిలీజ్ చేసారు. చక్రవర్తి గారి సంగీతం అందించిన ఈ చిత్రం లోని నీను నీకై పుట్టినానని పాట నాకు చాలా ఇష్టమైన పాట, వేటూరి వారి సాహిత్యం.



https://www.youtube.com/watch?v=Vr06_pD9psI


No comments:

Post a Comment