Monday, August 3, 2015

jeevana vaahini...

మిత్రులకి శుభోదయం

షట్చక్రవర్తులలో ఒకరైన సూర్యవంశానికి చెందిన సగరునికి ఆయిన భార్య వైదర్భి కి కలిగిన వారు  60వేల మంది కుమారులు, వారి తప్పిదానికి  కపిల మహర్షి వారిని భస్మం చేసారు, సగరుడి రెండవ భార్య శైబ్య కుమారుడైన అంశుమన్ ప్రయత్నం విఫలమవగా ఆయిన మనుమడు భగీరధుడు చేసిన తపస్సు వలన దివినుంచి భువికి గంగ వచ్చిందనే పురాణ కధ మనకు తెలిసిందే, భగిరధ ప్రయత్నం అనే తెలుగు వాచకం లోని కధ కూడా కొందరు మిత్రులు చదివే ఉంటారు, గంగావతరణం గురించి ఎందరో కవులు రాసారు, సీతారామశాస్త్రి గారి గంగావతరణం అయితే గంగ ఎంత వేగంగా పరుగులిడుతుందో అంతే వే"గంగా" వారి సాహిత్య వాహిని ఉంటుంది.

వేటురివారు, KR గారి గంగోత్రి చిత్రం కోసం గంగమ్మ మీద చక్కటి పాట రాసారు, మంచి సంగీత దర్శకుడే కాదు, మంచి గాయకుడైన శ్రీ MM కీరవాణి ఆలపించిన ఈ గంగమ్మ మీద పాట చూడండి.

ఈ పాట విన్నప్పుడల్లా ఒక్కసారి ఆ దేవభూమికి వెళ్ళి పోతుంది నా మనసు, బద్రీనాధ యాత్ర గుర్తుకొస్తుంది, జల జల పారే చల్లటి ఆ అలకనంద అందాలు గుర్తుకొస్తాయి.

రెండవ చరణం చూడండి కవి హృదయం ఎంత గొప్పదో, సాయమునకి వెనకాడవద్దని గంగకి చెప్పమనడం అది వేటురివారికే చెల్లింది.



ఓం ఓం
జీవన వాహిని ... పావని
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి
గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు  అలకనందమై
సగర కులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

పసుపు కుంకుమతో పాలు పన్నీటితో 
శ్రీ గంధపు ధారతో పంచామృతాలతో 
అంగాగం తడుపుతూ దోషాలను కడుగుతూ 
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం 

అమ్మా గంగమ్మా క్రిష్ణమ్మకు చెప్పమ్మా 
కష్టం కలిగించోద్దని 
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని 
గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి 
దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికి 
చెప్పమ్మా మా గంగమ్మా..... 


జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా
శివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి

https://www.youtube.com/watch?v=AApGOCvVYlQ

https://www.youtube.com/watch?v=Y-Q8H-QhVm0

No comments:

Post a Comment