మిత్రులకు శుభోదయం
షష్టిపూర్తి జరుపుకుంటున్న సుప్రీం హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏంటి అంతా మెగా స్టార్ అంటారు వీరు సుప్రీం హీరో అని అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా, నా టీనేజ్ లో చిరంజీవి గారిని ఇలానే పిలిచేవారు, తరువాత తరువాత మెగా స్టార్ అన్నారు. వారి తల్లి గారు అంజనా దేవి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు, ఏంటి వారి అమ్మగారి పుట్టిన రోజు కూడా ఇవాళే అనుకుంటున్నారా, కాదు తల్లి మనల్ని కనటం కోసం అష్టకష్టాలు పడి ఈ భూమిమీదకి తెస్తుంది కదా ఆవిడ పడే కష్టం పునర్జన్మ తో సమానమంటారు, ప్రతీ తల్లి బిడ్డని కని మళ్ళి జన్మిస్తుంది కాబట్టి వారి అమ్మగారికి కూడా చెప్పా.
చిరంజీవి అంటే కేవలం మాస్ ఆడియన్స్ కోసమని, బ్రేక్ డాన్సులు, ఫైట్స్ తప్ప వేరే ఉండవు అని ఎందరో విమర్శించారు, విమర్శిస్తున్నారు. వారందరికీ ఒక మనవి చిరంజీవి ఒక మంచి నటుడు కావాలంటే వారు చేసిన కొన్ని చిత్రాలు చెప్తా చూడండి. శుభలేఖ, మంచు పల్లకి, ఆలయశిఖరం, విజేత, ఆరాధన, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్భాందవుడు ఇలా చాలానే ఉన్నాయ్ లిస్టు చెప్పుకుంటూ పొతే. పైన చెప్పిన ఏ చిత్రాలు కమర్షియల్ చిత్రాలు కావు, ఎంత మంది ఈ ఆర్టికల్ చదువుతున్నవారు చిరంజీవి ని విమర్శించే వారు చూసారు. తన పందా మార్చి మాస్ చిత్రాలు చేసారు చిరు ఎక్కవుగా. ఈ రోజు ప్రేక్షకుల పందా మారింది, ఆలోచనా విధానం మారింది. కంటెంట్ లేక పొతే కటవుట్ లేదంటున్నారు. ఈ రోజు 100 కోట్లు శ్రీమంతుడు సాదించింది అంటే ప్రేక్షకులలో మార్పే కారణం అంటా. సొంత బ్యానర్ మీద రుద్రవీణ చిత్రం తీసి ఆర్ధికంగా ఎంతో నష్టపోయారు చిరు.
150 చిత్రం గురించి అందరు చర్చిస్తున్నారు అంతగా నాకు ఇంటరెస్ట్ లేదు కారణం బాలచందర్, బాపు, విశ్వనాద్, భారతీరాజా లాంటి దర్శకులు లేరు, ఉన్న మంచి దర్శకులు (నాకు నచ్చే) కృష్ణ వంశి, రాజమౌళి, త్రివిక్రమ్, శ్రీకాంత్ అడ్డాలా లాంటి వారితో చెయ్యరేమో ? అందుకని వారి పాత చిత్రాల్లో ఉన్న మజా ఉండకపోవచ్చు.
నాకు చాలా చాలా ఇష్టమైన చిరంజీవి గారి ఈ పాట వినండి చూడండి
https://www.youtube.com/watch?v=S8ANsRfVPSw

No comments:
Post a Comment