Monday, August 10, 2015

శ్రీమంతుడు "మరో రుద్రవీణ "

"దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలు" ఇది ట్యాగ్ లైన్ పెట్టి ఉంటే బాగుండేది. గాంధీ గారి మాటలు కొరటాల గారికి గుర్తొచ్చి కధ రాసారనుకుంటా. 

దేశానికి పల్లెలు జీవధారా సదృశాలు. 
దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలు. 
దేశ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి, సహజీవనానికి పల్లెలు కాణాచులు, ఆదర్శాలు, 
రైతు దేశానికి వెన్నెముక వంటి వాడని మహనీయులు పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు. అదే ఈ చిత్రానికి మూలాధారం. 

రివ్యూ రాసే అంత ఎత్తుకి నేను ఎదగలేదు కాని, మంచి చూసినప్పుడు నలుగురికి తెలియచేయాలనే సంకల్పంతో రాస్తున్నా. 

రివ్యూ రాసే ప్రతివారు సినిమా ప్లుస్లూ, మైనస్లు అని రాస్తారు, కాని నేను అలాకాకుండా ఏది సమాజానికి అవసరమో ఏది సమాజానికి అవసరంలేదో రాద్దాం అనుకుంటున్నా. 

ఈ సినిమా, మనకి ప్రస్తుత పరిస్థుతులను బట్టి చాలా అవసరం, అవసరం లేనిది ఏదైనా ఉంది అంటే అది కామిడి లేదు, వెకిలి వేషాలు లేవు, హీరోయిన్ ఎక్ష్పొజింగ్ లేదు  వాటి గురించి రాయక్కరలేదు మనం చూడక్కరలేదు. 

కొరటాల శివ ఈ కధ మహేష్ బాబు లాంటి వారికి చెప్పి ఒప్పించడం తోనే కొంతవరకు విజయాన్ని సాధించినంటే, మహేష్ ని చూస్తే తెలుగు అమీర్ ఖాన్ అనాలనిపిస్తోంది, perfectionist గా మారుతున్నాడు, కాని కొంత వరకు తను వాడే భాష (diction) లో మార్పు అవసరం, కధలో వైవిద్యం ఉన్నట్టే నటనలో కూడా చూపాలి, లేందంటే ప్రవర్తన, నడకా, నటనా, భాషా, తీరు ఒక్కలా కనిపిస్తే బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. 

సినిమా కధకి ఆయువు పట్టైన హీరోయిన్ తన స్నేహితురాలితో చెప్పే మాట "రెండవసారి పిల్లలని కనొద్దు ఎవరినైనా పెంచుకోండి, ఎంతోమంది తల్లి తండ్రులు లేని వాళ్ళు ఉన్నారు" అంటుంది, నన్ను ఎంతగానో కదిలించింది, హీరోగారిని కూడా, దత్తత తీసుకోవడం ఒకళ్ళనొ ఇద్దరినో కాదు ఊరు ఊరుంతా దత్తత తీసుకుంటా అంటూ inspire అవుతాడు, సచిన్ టెండూల్కర్ లా. 

6వతేదీ రాత్రి మాతో పనిచేసే ఒక స్నేహితుడికి రాత్రి డ్యూటీ అయినతరువాత ఇంటికి వెళుతుంటే, పిల్ల ఏడుపు వినిపించి వెతకగా చెత్తకుప్ప లో ఒక ఆడ శిశువు దొరికింది (ఇది సినిమా స్టొరీ కాదు నిజం) గాంధీ హాస్పిటల్ దగ్గర, ఆ పిల్లకి  నిలోఫేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇలా ఎన్నో జరుగుతున్నాయి, effort చెయ్యలేని వాళ్ళు పిల్లలని కని పారైడం, effort చెయ్యగలిగిన వారికి పిల్లలు లేకుండా, ఇదంతా దేవుడి లీలా అనుకోకుండా సమాజానికి ఈ పిల్లలు వారి భవష్యత్తు అవసరం అనుకోని సహాయం చెయ్యమని చెపుతోంది ఈ చిత్రం. 

మూస సినిమాలలా  కాకుండా ఆలోచన రేకెత్తించే కధతో చేసిన ఈ చిత్ర దర్శకుడిని మరోసారి అభినందించకుండా ఉండలేకపోతున్నా.  త్రివిక్రమ్, శ్రీకాంత్ అడ్డాలా ఇప్పుడు కొరటాల శివ ఈతరంలో మరో బాలచందర్ లా కనిపిస్తున్నారు నాకు. 

రేటింగ్ ఇవ్వదలచుకోలేదు. 

సకుటుంబంగా చూడదగ్గ చిత్రం, ఇంకేం కావాలి. 

  




No comments:

Post a Comment