Friday, July 17, 2020

ఇన్నిటా నింతటా నిరవోకటే

జై శ్రీమన్నారాయణ

రాగం : ఆభోగి
సంపుటి : 4, సంకీర్తన 314
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు

"సంకీర్త్య నారాయణ  శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖినో భవంతి" అంటుంది విష్ణు సహస్రనామస్తోత్రం! అంటే కేవలం నారాయణ్ శబ్దం ఉచ్చరించిన మాత్రము చేతనే మన దుఃఖాలు, రోగాలు తొలగిపోతాయని అర్ధం. అట్టి వెన్నుని నామాన్ని వేదంగా స్వీకరించాడు అన్నమయ్య. ఈ యుగంలో మనందరికీ ఆశ్రయమైనది ఆ పద్మ పత్రాక్షుని నామమే! ఈ నామాన్ని కీర్తించే  ఇంతకు మునుపు పుణ్యులు తరించారు! దైర్యశాలులందరికి మార్గమిది! పాపాలను పరిహరించే  పావనమంత్రమిది! అదే తిరువేంకటగిరి దేవుని నామము! అని అంటున్నారు మన అన్నమయ్య! ఆ పద కవితాపితామహుడు సంకీర్తనలలో అనుగ్రహించిన వేంకటేశ్వర నమ మంత్రాన్ని మనమంతా స్వీకరించి ముక్తులమవుదాం! పదండి ముందుకు ఆ నామాన్ని  స్వీకరించటానికి!

అర్ధాలు
ఇరవు = స్థానము
సంజీవని = జీవము కలుగచేయునది
ధీరులు = విద్వాంసులు, దైర్యం కలవారు,
తెరువు = మార్గము
గోవర్ధనధర = గోవర్ధన పర్వతాన్ని ధరించినవాడు (శ్రీకృష్ణుడు)

ఇన్నిటా నింతటా నిరవోకటే
వెన్నుని నామమే వేదంబాయే

నలినదళాక్షుని నామకీర్తనము
కలిగి లోకమున కలదొకటే
యిల నిదియే భజియింపగపుణ్యులు
చెలఁగి తలఁప సంజీవని ఆయ

కోరిక అత్యుత గోవిందా యని
ధీరులు తలపఁగ తెరువొకటే
ఘోర దురితహార గోవర్ధధర
నారాయణ యని నమ్మగగలిగే

తిరువేంకటగిరి దేవుని నామము
ధరతలపగ నాధారమిదే
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయ



No comments:

Post a Comment