Friday, July 17, 2020

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా

చిత్రం : ముహూర్త బలం (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల

Uploaded by @padmacharan

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా

కోరుకున్న చిన్న దాన్ని గుండెలోన ఏముందో
కొంచెమైన తెలుసుకున్నావా ఆ ఆ ఆ...

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు…..
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు……

నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసే
వేళ కోసం వేచి ఉన్నాను ఊ ఊ ఊ....

బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

Uploaded by @padmacharan

ముత్యాల పందిరి వేసి రత్నాల పీట వేసి
బంగారు చేతులతో... బాసికం కడతావా...

మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి
మురిపించే చేతులతో మూడు ముుళ్ళు వేస్తానే..
నీ జోడు కూడి వస్తానే...

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు

Uploaded by @padmacharan

కన్నె పిల్ల వలపంటే..వెన్నపూస లాంటిది
కాస్త వేడి సోకిందా... కరిగి పోతానంటదీ...

చల చల్లని కళ్ళల్లో..
మెలమెల్లగ దాచుకుంటే
వెన్న లాంటి ఆ వలపే..వేడి తగలకుంటదీ..
నా నీడ లాగ ఉంటదీ...

బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు 
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోలేదు 

Uploaded by @padmacharan

No comments:

Post a Comment