Friday, July 24, 2020

జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా

చిత్రం : నీలి మేఘాలు
సంగీతం : దుగ్గిరాల
గానం : నిత్య సంతోషిణి
సాహిత్యం : సుమన్ జూపూడి


జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా
కూనలమ్మ కోరుకుంది చిరునవ్వు ఈ వేళ
happy birthday to you dear
happy birthday to you dear
happy birthday to you dear...
జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా
కూనలమ్మ కోరుకుంది చిరునవ్వు ఈ వేళ

స్నేహమే జీవితమని తలచే చెలిమి నీదేనని
మనసులో మమకారం పంచే  హితుడు నీవేనని
స్నేహమే జీవితమని తలచే చెలిమి నీదేనని
మనసులో మమకారం పంచే  హితుడు నీవేనని
తలచి చేరా నీ దరి  వీడవా మౌనం మరి
happy birthday to you dear
happy birthday to you dear
happy birthday to you dear...
జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా
కూనలమ్మ కోరుకుంది చిరునవ్వు ఈ వేళ


కమ్మగ సాగే పాటకు  నీవే  పల్లవి కావాలని
రమ్మని పిలిచే వసంతాలలో చల్లగ సాగాలని
కమ్మగ సాగే పాటకు  నీవే  పల్లవి కావాలని
రమ్మని పిలిచే వసంతాలలో చల్లగ సాగాలని
పలికే వేణుగానమా నీ పలుకే బంగారమాయనా 
happy birthday to you dear
happy birthday to you dear
happy birthday to you dear...
జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా
కూనలమ్మ కోరుకుంది చిరునవ్వు ఈ వేళ 

No comments:

Post a Comment